News June 7, 2024
మంగళగిరి AIIMS వద్ద చంద్రబాబు ప్రమాణస్వీకారం?

AP: మంగళగిరి ఎయిమ్స్ వద్ద విశాలమైన స్థలంలో చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు స్థలాన్ని పరిశీలించారు. నేడో రేపో వేదికను అధికారికంగా పార్టీ ప్రకటించనుంది. కాగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతోపాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది.
Similar News
News February 2, 2026
జీరో టిల్లేజి సాగు విధానం – ఏ పంటలకు అనుకూలం?

వరి కోత యంత్రంతో పైరును కోశాక దుక్కి చేయకుండా ఇతర పంట విత్తనాలను విత్తే పద్ధతిని జీరో టిల్లేజి సాగు పద్ధతి అంటారు. ఇది మొక్కజొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు, శనగకు అనుకూలం. ఈ పద్ధతిలో విత్తేటప్పుడు చాలినంత తేమ నేలలో లేకపోతే ఒక తడి ఇచ్చి విత్తుకొవడం మంచిది. విత్తనాలను చేతితో విత్తే పరికరాలతో నాటితే సమయం ఆదా అవుతుంది. వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ, మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ ఉండేట్లు విత్తుకోవాలి.
News February 2, 2026
రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన SC

TG: సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్‌గా కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు మార్గదర్శకాలు ఇచ్చిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్త SMలో పోస్టులు చేయడంపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇది హైకోర్టుకు చేరగా FIRలను కొట్టివేస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. దీనిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
News February 2, 2026
గుడ్ న్యూస్: వేగంగా రైల్వే ప్రాజెక్టులు

TG, AP పరిధిలో ఉన్నSC జోన్‌లోని ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ జోన్లో 1,763.26 KMమేర ₹27,342.44 CRతో 18 ప్రాజెక్టులను గతంలో చేపట్టారు. ₹4684 CRతో ముద్ఖేడ్-డోన్ లైన్ విద్యుదీకరణ, ₹3591 CRతో 173 KM పాండురంగాపురం లైన్, ₹3103CRతో విజయవాడ-ఖాజీపేట మధ్య 3వ లైన్ వంటి పనులు పూర్తిచేస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా ఇటీవల SEC-వాడి మధ్య 4వ లైన్‌ను ₹5012 CRతో ఆమోదించింది.


