News June 7, 2024
వాట్సాప్‌లో ‘స్టేటస్ ర్యాంకింగ్’ ఫీచర్

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ‘స్టేటస్ ర్యాంకింగ్’ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా యూజర్ల చాట్ హిస్టరీ ఆధారంగా స్టేటస్‌లు ఆర్డర్‌లో కనిపిస్తాయి. తరచుగా చాట్ చేసేవి, రీసెంట్‌గా మెసేజులు చేసిన కాంటాక్ట్‌ల స్టేటస్‌లను టాప్‌లో చూపిస్తుంది. అలాగే ఎక్స్‌పైరీ టైమ్ దగ్గరపడ్డ వాటిని కూడా పైన కనపడేలా డిస్‌ప్లే చేస్తుంది. దీంతో యూజర్లు ముఖ్యమైన అప్‌డేట్స్ కోల్పోకుండా ఉంటారని సంస్థ భావిస్తోంది.
Similar News
News September 12, 2025
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. Sensex 152 పాయింట్ల లాభంతో 81,700 వద్ద, Nifty 49 పాయింట్ల వృద్ధితో 25,054 వద్ద కొనసాగుతున్నాయి. హిందాల్కో, మారుతీ సుజుకీ, టాటామోటార్స్, టాటా స్టీల్, యాక్సిస్, సిప్లా, హీరో మోటోకార్ప్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో, SBI, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
News September 12, 2025
రవీంద్రభారతిలో ఎస్పీ బాలు కాంస్య విగ్రహం

TG: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఘంటసాల విగ్రహం పక్కనే ఎస్పీబీ విగ్రహాన్నీ నిర్మించనున్నారు. ఈమేరకు విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు, సాంస్కృతికశాఖ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. త్వరలో నిర్మాణం పూర్తిచేయనున్నారు. కాగా కరోనా సమయంలో 2020 సెప్టెంబర్ 25న బాలు కన్నుమూశారు.
News September 12, 2025
CPL: చివరి బంతికి గెలిపించిన హోల్డర్

CPLలో సెయింట్ కిట్స్&నెవిస్ పాట్రియాట్స్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. ఇన్నింగ్స్ చివరి బంతికి వికెట్ తీసి తన జట్టుకు విజయం కట్టబెట్టారు. తొలుత సెయింట్స్ కిట్స్ 20 ఓవర్లలో 150/7 పరుగులు చేసింది. హోల్డర్ 30 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 53 పరుగులు బాదారు. ఛేదనలో బార్బడోస్ రాయల్స్ 149/7కే పరిమితమైంది. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా డానియల్ సామ్స్‌ను హోల్డర్ ఔట్ చేశారు.