News June 7, 2024
ధనిక దేశంలో మ్యాచ్ ఫీజు రూ.20 వేలే!

టీ20 వరల్డ్ కప్‌లో పసికూనగా బరిలోకి దిగిన USA సంచలనాలు నమోదు చేస్తోంది. పాక్ లాంటి మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ జట్టు ప్లేయర్లలో చాలా మంది ఉద్యోగాలు చేస్తూనే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నారు. వారి మ్యాచ్ ఫీజు కూడా తక్కువేనని తెలుస్తోంది. ఒక్కో మ్యాచ్‌కు కేవలం రూ.20 వేలు చెల్లిస్తున్నారట. భారత క్రికెటర్లకు టీ20 మ్యాచ్ ఫీజు రూ.3 లక్షలుగా ఉంది.
Similar News
News September 12, 2025
రవీంద్రభారతిలో ఎస్పీ బాలు కాంస్య విగ్రహం

TG: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఘంటసాల విగ్రహం పక్కనే ఎస్పీబీ విగ్రహాన్నీ నిర్మించనున్నారు. ఈమేరకు విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు, సాంస్కృతికశాఖ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. త్వరలో నిర్మాణం పూర్తిచేయనున్నారు. కాగా కరోనా సమయంలో 2020 సెప్టెంబర్ 25న బాలు కన్నుమూశారు.
News September 12, 2025
CPL: చివరి బంతికి గెలిపించిన హోల్డర్

CPLలో సెయింట్ కిట్స్&నెవిస్ పాట్రియాట్స్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. ఇన్నింగ్స్ చివరి బంతికి వికెట్ తీసి తన జట్టుకు విజయం కట్టబెట్టారు. తొలుత సెయింట్స్ కిట్స్ 20 ఓవర్లలో 150/7 పరుగులు చేసింది. హోల్డర్ 30 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 53 పరుగులు బాదారు. ఛేదనలో బార్బడోస్ రాయల్స్ 149/7కే పరిమితమైంది. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా డానియల్ సామ్స్‌ను హోల్డర్ ఔట్ చేశారు.
News September 12, 2025
OTTలోకి వచ్చేసిన అనుపమ ‘పరదా’

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాగ్ మయూర్, గౌతమ్ మేనన్, సంగీత, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఆగస్టు 22న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది.