News June 7, 2024
ఏపీలో తొలగింపు.. మరుసటి రోజే తెలంగాణలో పదవి

TG: ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆయన్ను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సలహాదారుగా నియమించింది. జగన్ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుగా ఉన్న ఆయన్ను నిన్ననే అక్కడి ప్రభుత్వం తొలగించింది. మరుసటి రోజే తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమించడం విశేషం. నీటిపారుదల శాఖలో ఆదిత్యనాథ్ దాస్‌కు సుదీర్ఘ అనుభవం ఉండటంతో రేవంత్ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 12, 2025
రవీంద్రభారతిలో ఎస్పీ బాలు కాంస్య విగ్రహం

TG: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఘంటసాల విగ్రహం పక్కనే ఎస్పీబీ విగ్రహాన్నీ నిర్మించనున్నారు. ఈమేరకు విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు, సాంస్కృతికశాఖ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. త్వరలో నిర్మాణం పూర్తిచేయనున్నారు. కాగా కరోనా సమయంలో 2020 సెప్టెంబర్ 25న బాలు కన్నుమూశారు.
News September 12, 2025
CPL: చివరి బంతికి గెలిపించిన హోల్డర్

CPLలో సెయింట్ కిట్స్&నెవిస్ పాట్రియాట్స్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. ఇన్నింగ్స్ చివరి బంతికి వికెట్ తీసి తన జట్టుకు విజయం కట్టబెట్టారు. తొలుత సెయింట్స్ కిట్స్ 20 ఓవర్లలో 150/7 పరుగులు చేసింది. హోల్డర్ 30 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 53 పరుగులు బాదారు. ఛేదనలో బార్బడోస్ రాయల్స్ 149/7కే పరిమితమైంది. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా డానియల్ సామ్స్‌ను హోల్డర్ ఔట్ చేశారు.
News September 12, 2025
OTTలోకి వచ్చేసిన అనుపమ ‘పరదా’

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాగ్ మయూర్, గౌతమ్ మేనన్, సంగీత, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఆగస్టు 22న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది.