News June 7, 2024
NEET ఫలితాల్లో అవకతవకలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలి: ప్రియాంక
NEET ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన ఆరుగురికి 720/720 మార్కులు రావడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. తొలుత ప్రశ్నపత్రం లీకైందని, ఇప్పుడు ఫలితాల్లో స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు.
Similar News
News November 29, 2024
రాష్ట్రానికి తప్పిన ముప్పు
ఏపీకి తుఫాను ముప్పు లేదని వాతావరణ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందలేదని, ఇది ఈ సాయంత్రం వరకు వాయుగుండంగా బలహీనపడుతుందన్నారు. రేపు ఉదయం కల్లా కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని చెప్పారు. తుఫాన్ ముప్పు లేకున్నా వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News November 29, 2024
భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణికిస్తున్న చలి
APలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా మన్యంలో చలి పంజా విసురుతోంది. గత ఏడాది NOV 10-30 తేదీల్లో 13-13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈసారి మరో 5డిగ్రీలు తగ్గిపోయాయి. నిన్న డుంబ్రిగూడలో 8.6, జి.మాడుగుల, జీకే వీధిలో 8.7, హుకుంపేటలో 8.8, అరకులోయలో 9.1డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం, సాయంత్రం బయటికెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
News November 29, 2024
కులగణన తర్వాత రిజర్వేషన్లలో మార్పులు!
TG: సమగ్ర కులగణన తర్వాత పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వపరంగా పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదనే నిబంధన ఉన్నందున ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 31న సర్పంచ్‌ల పదవీకాలం పూర్తవ్వగా పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.