News June 7, 2024

ఏడాదిలో మళ్లీ ఎన్నికలు ఖాయం: భూపేశ్ బఘేల్

image

పార్టీలను చీల్చిన వారికి, CMలను జైలులో పెట్టిన వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని ఛత్తీస్‌గఢ్ మాజీ CM భూపేశ్ బఘేల్ వ్యాఖ్యానించారు. దేశంలో ఏడాదిలోనే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. INC కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘మహారాష్ట్ర డిప్యూటీ CM ఫడ్నవీస్ రిజైన్ చేయబోతున్నారు. UPలో యోగి కుర్చీ షేక్ అవుతోంది. రాజస్థాన్ CM భజన్ లాల్ ఊగిసలాడుతున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News November 29, 2024

చరిత్ర సృష్టించిన జాన్సెన్

image

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు <<14734849>>పడగొట్టిన<<>> సౌతాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ చరిత్ర సృష్టించారు. ఓ ఇన్నింగ్స్‌లో 7 ఓవర్ల లోపే(6.5) 7 వికెట్లు తీయడం 120 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరగా 1904లో AUS బౌలర్ హ్యూయ్ ట్రంబుల్ ENGపై 6.5 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి 7 వికెట్లు తీశారు. కాగా ప్రస్తుత టెస్టులో సౌతాఫ్రికా 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.
స్కోర్లు: SL 42, RSA 191&132/3

News November 29, 2024

మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్‌ రెడ్డితో సహా పలువురు కీలక నేతలు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. సీఎం వెంట మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి పయనం కానున్నారు. దీపాదాస్ మున్షీ, వంశీచంద్ రెడ్డి తదితరులు కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు.

News November 29, 2024

టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ విధానం తొలగింపు

image

TG: టెన్త్ పరీక్షల్లో <<14735937>>ఇంటర్నల్ మార్కులను<<>> తొలగించిన విద్యాశాఖ గ్రేడింగ్ విధానాన్నీ తొలగించాలని నిర్ణయించింది. ఏ1, ఏ2, బి1, బి2 గ్రేడులకు బదులు మార్కులను ప్రకటించనుంది. అలాగే ఆన్సర్ షీట్లలో కూడా మార్పులు చేసింది. 4 పేజీల బుక్ లెట్+అడిషనల్ పేపర్లకు బదులు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్లను ఇవ్వనుంది. సైన్స్ పేపర్లకు ఒక్కో దానికి 12 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇవ్వాలని నిర్ణయించింది.