News June 7, 2024
369 మంది పోటీ.. 311 మంది డిపాజిట్ గల్లంతు

ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 29 MP స్థానాలనూ గెలుచుకుని BJP రికార్డు సృష్టించింది. గత 40 ఏళ్లలో ఆ రాష్ట్రంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. మొత్తం 369 మంది పోటీ చేయగా 311 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇండోర్‌లో బీజేపీ నేత శంకర్ లల్వానీ రికార్డు స్థాయిలో 11.75 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మిగిలిన అన్ని చోట్లా నాయకులు లక్ష నుంచి 5 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Similar News
News September 12, 2025
శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 66,312 మంది దర్శించుకోగా.. 27,728 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. మరోవైపు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీవారిని దర్శించుకున్నారు.
News September 12, 2025
వాకింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా?

వాకింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నడిచే సమయంలో కొన్ని తప్పులు చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘తక్కువ వేగంతో నడిస్తే క్యాలరీలు బర్న్ కావు. వేగంగా నడిస్తేనే గుండె, కండరాలు బలోపేతం అవుతాయి. ఫోన్ చూస్తూ వాకింగ్ చేయకూడదు. ఇలా చేస్తే వెన్ను, మెడ నొప్పి సమస్య వస్తుంది. సౌకర్యవంతమైన బూట్లు ధరించి నడవాలి. ఖాళీ కడుపుతో లేదా అతిగా తిన్న తర్వాత వాకింగ్ చేయడం మంచిది కాదు’ అని చెబుతున్నారు.
News September 12, 2025
భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధరలు

AP: రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా కిలో రూ.2కి పడిపోయింది. నంద్యాల, మదనపల్లె మార్కెట్లలో రూ.3-రూ.10 వరకు పలికింది. అటు కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు ఉల్లి క్వింటా రూ.150 చొప్పున కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. దీంతో కూలీ ఖర్చులు కూడా రావట్లేదని వాపోయారు.