News June 7, 2024

VZM: అప్పుడు 7 వేలు ఓట్లు.. ఇప్పుడు 1,09,915

image

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన లోకం నాగ మాధవి కేవలం 7వేల ఓట్లకే పరిమితమయ్యారు. 2024లో టిక్కెట్ దక్కించుకున్న ఆమె.. తన చరిష్మాతో నియోజకవర్గమంతా తిరిగి ప్రజాభిమానాన్ని సంపాదించారు. ముఖ్యంగా పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చి యువతను తన వైపు ఆకర్షించారు. ఫలితంగా 1,09,915 ఓట్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్నారు.

Similar News

News November 9, 2025

మైనార్టీ వెల్ఫేర్ డే కు ఏర్పాట్లు పూర్తి: VZM కలెక్టర్

image

జనాబ్‌ మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ జన్మదినం సందర్భంగా రేపు విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు మైనారిటీ వెల్ఫేర్ డే & జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొంటారన్నారు.

News November 9, 2025

అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలి: VZM కలెక్టర్

image

ప్రజల సమస్యల పరిష్కారార్థం రేపు (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజలు తమ వివరాలతో పాటు అర్జీలను సమర్పించాలని సూచించారు. అర్జీల స్థితి కోసం కాల్‌ సెంటర్‌ 1100 ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు.

News November 9, 2025

విశాఖలో విజయనగరం జిల్లా వాసి మృతి

image

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి విశాఖలోని మల్కాపురంలో కొన్నేళ్లుగా ఉంటున్నాడు. అక్కడే ఓ బార్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యం బారిన పడిన గణపతి శనివారం అర్ధరాత్రి బార్ వద్దే ఆకస్మికంగా మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.