News June 7, 2024
పెదమానాపురం: గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి

దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు ఢీకొనగా గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు విజయనగరం రైల్వే ఎస్సై రవివర్మ తెలియజేశారు. రైలు పట్టులు దాటుతుండగా మృతి చెందినట్లు చెప్పారు. గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 20, 2026
VZM: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళికి రాష్ట్ర స్థాయి పురస్కారం

ఎన్నికల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు జిల్లా రెవెన్యూ అధికారి, KRRC స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళిను రాష్ట్ర ప్రభుత్వం ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్-2025’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈనెల 25న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయనకు పురస్కారం అందజేయనున్నారు. అవార్డుకు ఎంపిక కావడం పట్ల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
News January 20, 2026
VZM: స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు క్యాలెండర్లను ప్రారంభించిన కలెక్టర్

గ్రామ-వార్డు సచివాలయాల శాఖను ‘స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు’గా నామకరణం చేసిన నేపథ్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ క్యాలెండర్లను రాబోయే రెండు రోజుల్లో జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాలకు పంపిణీ చేయనున్నట్లు జిల్లా జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి ఎంరోజా రాణి తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
News January 20, 2026
విజయనగరం కలెక్టర్‌కు అవార్డు

విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి, పూర్వ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తమ ఎన్నికల జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. 2025లో నిర్వహించిన ఎన్నికల్లో అత్యుత్తమ విధానాలను అమలు చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి వీరి పేరును నామినేట్ చేశారు. జనవరి 25న విజయవాడలో జరగనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో వీరు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.


