News June 7, 2024
ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలుపు

TG: నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) విజయం సాధించారు. రెండు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో మల్లన్నకి బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. చివరి దశలో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్‌తో మల్లన్న, రాకేశ్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరికి BRS అభ్యర్థి ఎలిమినేషన్‌తో మల్లన్న గెలిచారు.
Similar News
News January 10, 2026
అమరావతిలో క్వాంటం సెంటర్‌కు టెండర్ ఖరారు

AP: రాజధానిలో క్వాంటం వ్యాలీ నిర్మాణ దిశగా మరో కీలక అడుగు పడింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ను APCRDA ఖరారు చేసింది. రూ.103 కోట్లతో L-1 బిడ్‌గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగిస్తూ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నమూనా రూపకల్పన నుంచి నిర్మాణం వరకూ L&Tనే చేపట్టనుంది. సెంటర్ నిర్మాణానికి CRDA నిధుల నుంచి రూ.137 కోట్లు కేటాయించారు.
News January 10, 2026
తిరుపతి SVIMSలో ఉద్యోగాలు

తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (<
News January 10, 2026
శని దేవుని ఆరాధనతో అనారోగ్య నివారణ

శనివారం రోజున శని దేవుడిని ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు సన్నగిల్లుతాయని జ్యోతిషులు చెబుతున్నారు. పలు శని దోషాలతో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కోసం నువ్వుల నూనెతో మర్ధన చేసుకోవాలని, శని శాంతి మంత్రాన్ని పఠించాలని సూచిస్తున్నారు. అందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఎముకలు, రక్తనాళాలను దృఢపరుస్తాయి. వ్యాయామం, ధ్యానం, ఆలయ ప్రదక్షిణలతో శని దేవుడు తృప్తి చెంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం.


