News June 7, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు APలోని రాయలసీమ, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. TGలోని పలు జిల్లాల్లో మరో 5 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News November 29, 2024
కులగణన తర్వాత రిజర్వేషన్లలో మార్పులు!
TG: సమగ్ర కులగణన తర్వాత పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వపరంగా పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదనే నిబంధన ఉన్నందున ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 31న సర్పంచ్ల పదవీకాలం పూర్తవ్వగా పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
News November 29, 2024
BJPకే సీఎం పదవి!
మహారాష్ట్ర సీఎం పదవి బీజేపీకే దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు మహాయుతి నేతలు శిండే, అజిత్ పవార్ అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి. మరో రెండు రోజుల్లో బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఉండాలని అజిత్, శిండేలను బీజేపీ హైకమాండ్ కోరినట్లు సమాచారం. హోం, ఆర్థిక, రెవెన్యూ లాంటి కీలకశాఖలు బీజేపీకే దక్కే అవకాశం ఉంది.
News November 29, 2024
ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్!
విద్యార్థులు తమ డిగ్రీ కోర్సును తగ్గించుకోవడం లేదా పొడిగించుకునే వెసులుబాటు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. చదివే సామర్థ్యం ఎక్కువ ఉన్నవారు రెండేళ్లలో డిగ్రీ పూర్తి చేయవచ్చన్నారు. అలాగే తక్కువ సామర్థ్యం ఉన్నవారు డిగ్రీ కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుకోవచ్చని పేర్కొన్నారు. ఉద్యోగాలతో పాటు అన్ని అర్హతలకు సంబంధించి ఇది సాధారణ డిగ్రీలాగే ఉండనుందన్నారు.