News June 8, 2024

జూన్ 8: చరిత్రలో ఈరోజు

image

1919: సినీ దర్శకుడు వేదాంతం రాఘవయ్య జననం
1946: నటుడు గిరిబాబు జననం
1957: నటి డింపుల్ కపాడియా జననం
1975: నటి శిల్పా శెట్టి జననం
1938: స్వాతంత్ర్య సమరయోధుడు బారు రాజారావు మరణం
2002: సంఘ సేవకుడు, పద్మభూషణ్ గ్రహీత భూపతిరాజు విస్సంరాజు మరణం
2015: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీవేత్త దాశరథి రంగాచార్య మరణం

Similar News

News September 10, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. ఆధార్‌లో తప్పులు సరిదిద్దాలని ఆదేశాలు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు చెల్లింపులను ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ(APBS) ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే లబ్ధిదారుల్లో దాదాపు 30% మంది వివరాలు వారి ఆధార్ రికార్డులతో సరిపోలడం లేదని అధికారులు గుర్తించారు. దీని వల్ల పేమెంట్స్ ఆగుతాయని తెలిపారు. ఆధార్ వివరాల్లో తప్పులు ఉంటే వేగంగా సరిదిద్దాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ MD గౌతమ్ ఆదేశించారు.

News September 10, 2025

రెస్టారెంట్లో కుళ్లిన ఆహారం, ఎలుకల మలం!

image

హైదరాబాద్‌లోని రెస్టారెంట్లలో తినేవారికి అలర్ట్. నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ రెస్టారెంట్ అబ్సల్యూట్ బార్బెక్యూకు చెందిన 10 బ్రాంచుల్లో రైడ్స్ చేయగా కిచెన్ ర్యాక్స్‌లో ఎలుకల మలం దర్శనమిచ్చింది. మురికి పాత్రలు, అపరిశుభ్రంగా ఫ్రిడ్జ్‌లు, బొద్దింకలు, ఎక్స్‌పైరీ ఆహారం, కుల్లిపోయిన పండ్లను గుర్తించారు. నోటీసులిచ్చి చర్యలకు సిద్ధమయ్యారు.
SHARE IT

News September 10, 2025

మరోసారి భారత్, చైనాలపై ట్రంప్ అక్కసు

image

భారత్‌తో మళ్లీ <<17663735>>స్నేహం<<>> కోరుకుంటూనే ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. భారత్, చైనాలపై 100% టారిఫ్స్ విధించాలని యూరోపియన్ యూనియన్‌ను కోరినట్లు సమాచారం. US, EU అధికారుల సమావేశంలో రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై చర్చ జరిగింది. ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ INDపై 50%, చైనాపై 30% టారిఫ్స్ విధించారు.