News June 8, 2024
స్టాక్ మార్కెట్ క్రాష్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్

ఎన్నికల ఫలితాల సందర్భంగా జూన్ 4న స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంపై సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. అదానీ హిండెన్‌బర్గ్ కేసు రిట్ పిటిషన్‌కు అనుబంధంగా ఈ పిటిషన్ ఫైల్ అయింది. మార్కెట్లు ఆ స్థాయిలో క్రాష్ కావడంపై విచారణ జరిపి సెబీ, కేంద్రం నివేదికలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపైన కూడా సెబీ తన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సమర్పించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.
Similar News
News September 10, 2025
మహాలయ పక్షాల్లో ఏం చేయాలి?

మహాలయ పక్షము పితృదేవతలను స్మరించుకునే పవిత్ర సమయం. ఈ పదిహేను రోజులు గతించినవారి ఆత్మశాంతి కోసం తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించాలి. ఇది తరతరాల అనుబంధాన్ని, కృతజ్ఞతను చాటుకునే ఆధ్యాత్మిక విధిని సూచిస్తుంది. ఈ సమయంలో చేసే పిండ ప్రదానాలు, అన్నదానాలు పితృదేవతలకు సద్గతిని ప్రసాదిస్తాయి. మనకు వారి ఆశీర్వాదాలు లభించేలా చేస్తాయి. ఈ కర్మలు మనల్ని మన మూలాలకు మరింత దగ్గర చేస్తాయి.
News September 10, 2025
మైథాలజీ క్విజ్ – 2

1. దశరథుడి తండ్రి పేరేంటి?
2. మహాభారతంలో ‘గాంగేయుడు’ అని ఎవర్ని అంటారు?
3. ‘చిఖల్ కలో’ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
4. ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు మనం ఏ పండగ జరుపుకుంటాం?
5. తుంబురుడి వీణ పేరేంటి?
6. ‘శ్వేత సౌధం’(The White Pagoda) అని ఏ ఆలయాన్ని అంటారు?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
News September 10, 2025
మనం రోజూ వాడే ఈ పదాల అబ్రివేషన్ తెలుసా?

*WiFi- వైర్‌లెస్ ఫిడిలిటీ, *ATM- ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్, *RIP – రెస్ట్ ఇన్ పీస్, *AM- యాంటి మెరిడియన్, *PM- పోస్ట్ మెరిడియన్, *QR Code- క్విక్ రెస్పాన్స్ కోడ్, *PIN- పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్, *IQ- ఇంటెలిజెన్స్ కోషెంట్ (తెలివితేటలు), *PDF- పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, *SIM- సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్, *GPS- గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.