News June 8, 2024
మరో 2 నెలల్లో ‘ఈనాడు’కు 50 ఏళ్లు.. అంతలోనే..

రామోజీరావు మానస పుత్రిక ‘ఈనాడు’ ప్రారంభించి ఈఏడాది ఆగస్టు 10 నాటికి 50 ఏళ్లు పూర్తవుతాయి. 1974లో ఈనాడు ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీరావు ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ సంచలనం సృష్టించారు. నిత్యం తె.జా 3-4 గంటల మధ్య ఈనాడు పేపర్ చదవడం ఆయనకు అలవాటు. మరో 2 నెలల్లో ఆ పేపర్‌కు 50 ఏళ్లు నిండనుండగా ఈ అరుదైన ఘట్టాన్ని చూడకుండానే రామోజీరావు కన్నుమూయడం విషాదకరం.
Similar News
News September 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 11, 2025
సెప్టెంబర్ 11: చరిత్రలో ఈరోజు

1906: దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ సత్యాగ్రహం ప్రారంభం
1911: భారత మాజీ కెప్టెన్ లాలా అమర్‌నాథ్ జననం
1895: స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే జననం
1947: కవి దువ్వూరి రామిరెడ్డి మరణం
1948: పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా మరణం
2022: నటుడు కృష్ణంరాజు మరణం (ఫొటోలో)
☞ జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం
News September 11, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 11, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
✒ ఇష: రాత్రి 7.34 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.