News June 8, 2024

ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

image

రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ అక్కడి నుంచే సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఓ మీడియా దిగ్గజానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి.

Similar News

News January 11, 2025

‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వుల ఉపసంహరణ

image

TG: గేమ్ ఛేంజర్ మూవీకి ప్రభుత్వం మరో బిగ్ షాకిచ్చింది. టికెట్ ధరలను పెంచుకోవచ్చంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే తెల్లవారుజాము <<15130242>>స్పెషల్ షోలను రద్దు<<>> చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఇకపై స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో మూవీ కలెక్షన్లపై ప్రభావం పడనుంది.

News January 11, 2025

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

image

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు మహ్మద్ షమీని BCCI ఎంపిక చేసింది. అలాగే ఈ జట్టులో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. జట్టు: సూర్య (C), శాంసన్, అభిషేక్, తిలక్, నితీశ్, జురేల్, రింకూ, హార్దిక్, అక్షర్, షమీ, అర్ష్‌దీప్, హర్షిత్, బిష్ణోయ్, వరుణ్, సుందర్. కాగా ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలో జరగనుంది.

News January 11, 2025

APలో రూ.14వేల కోట్ల పెట్టుబడులు: భరత్

image

AP: కర్నూలు(D) ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో రూ.14వేల కోట్ల పెట్టుబడులపై ఒప్పందం కుదిరినట్లు మంత్రి TG భరత్ తెలిపారు. జపాన్‌కు చెందిన యిటోయే మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్, ఇండియాకు చెందిన హైడ్రైస్ గ్రూప్‌లతో ఈ మేరకు మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం కుదిరిందన్నారు. సెమీ కండక్టర్ రంగంలో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు భరత్ చెప్పారు. రెండున్నర ఏళ్లలో ఇది పూర్తి చేసేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.