News June 8, 2024

ఉమ్మడి విశాఖలో మంత్రులు ఎవరు?

image

ఉమ్మడి జిల్లాలోని అరకు, పాడేరు మినహా మిగిలిన చోట్ల కూటమి విజయం సాధించింది. TDP నుంచి గంటా, అయ్యన్న, బండారు వంటి మాజీ మంత్రులు ఉన్నారు. మహిళా కోటాలో అనిత ఉండగా.. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన పల్లాతోపాటు ఎక్కసార్లు గెలిచిన వెలగపూడి, గణబాబు కూడా TDP అభ్యర్థులే. జనసేనలో మాజీ మంత్రి కొణతాలతో పాటు పంచకర్ల, మొదటిసారి గెలిచిన సుందరపు, వంశీ ఉన్నారు. బీజేపీ తరఫున విష్ణుకుమార్‌కు ఇది రెండో విజయం.

Similar News

News November 7, 2025

విశాఖ: పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా

image

13 నెలలుగా పెండింగ్‌లో ఉన్న రూ.400 కోట్లలో కనీసం 6 నెలల బిల్లులను వెంటనే చెల్లించాలని GVMC కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శుక్రవారం GVMC గాంధీ విగ్రహ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి ధర్నా చేపట్టారు. బిల్లులు చెల్లించకపోతే ఇక పనులు చెయ్యలేమన్నారు. GVMC బడ్జెట్ ఉన్న వర్కులకు మాత్రమే టెండర్లు పిలవాలన్నారు. ధర్నా అనంతరం ర్యాలీగా వెళ్లి GVMC కమిషనర్, మేయర్‌‌కు వినతిపత్రం అందజేశారు.

News November 7, 2025

విశాఖ: పాఠశాలలకు రేపు సెలవు రద్దు

image

విశాఖలో రేపు రెండో శనివారం సందర్భంగా సెలవు రద్దు చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. తుఫాన్ కారణంగా అక్టోబర్ 27న పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో.. ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్ణయించారు. ఈ మేరకు అన్ని మేనేజ్‌మెంట్‌ల పాఠశాలలు రేపు సాధారణంగా పనిచేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.

News November 7, 2025

విశాఖ రేంజ్‌లో వందేమాతరం గీతాలాపన

image

విశాఖ రేంజ్‌ పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ‘వందేమాతరం’ గీతాలాపన చేశారు. జాతీయ గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డీఐజీ గోపీనాథ్‌ జెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకోవాలని, జాతీయ గీతాల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలని సూచించారు.