News June 8, 2024
ఉత్తమ జర్నలిస్టులను అందించిన అక్షర యోధుడు
మీడియా మొఘల్ రామోజీరావు తెలుగు సమాజానికి ఎంతో మంది నిఖార్సైన జర్నలిస్టులను అందించారు. ‘ఈనాడు జర్నలిజం స్కూల్’ ద్వారా వేలాది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడున్న టీవీ ఛానల్స్, పత్రికల్లో పనిచేసే ఎడిటర్లు, రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టుల్లో ఎక్కువ శాతం మంది EJSలో ట్రైనింగ్ పొందినవాళ్లే. ఇక్కడ శిక్షణ పొందారంటే క్రమశిక్షణ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లక్షణాలు అలవడుతాయని ప్రతీతి.
Similar News
News November 29, 2024
వివేకా హత్య కేసు.. భాస్కర్ రెడ్డికి సుప్రీం నోటీసులు
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లతోపాటు దీన్ని జతచేయాలని సునీత తరఫు లాయర్ కోరారు. దీంతో ఆ మేరకు సుప్రీం ఆదేశాలిచ్చింది.
News November 29, 2024
‘గేమ్ ఛేంజర్’ నుంచి వరుస అప్డేట్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి నిన్న మూడో సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. డిసెంబర్ రెండవ వారంలో నాలుగో సింగిల్ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనవరి తొలి వారంలో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌లో అంజలి- చరణ్ మధ్య ఓ మెలోడీ సాంగ్ ఉంటుందని సమాచారం.
News November 29, 2024
అమెరికాలో చదివే భారత విద్యార్థులకు అలర్ట్
అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులతో పాటు ఇతర దేశాల స్టూడెంట్లకు అక్కడి యూనివర్సిటీలు కీలక సూచనలు చేశాయి. శీతాకాలం సెలవులకు స్వదేశానికి వెళ్లిన విద్యార్థులు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి (జనవరి 20) ముందే USA వచ్చేయాలని మెసేజులు పంపుతున్నాయి. వ్యాలిడ్ వీసాలు ఉన్న విద్యార్థులకు ట్రంప్ విధానాలతో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఛాన్స్ తీసుకోకూడదని యూనివర్సిటీలు భావిస్తున్నట్లు సమాచారం.