News June 8, 2024
పదేళ్ల తర్వాత J&Kలో అసెంబ్లీ ఎన్నికలు!
J&Kలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు EC సిద్ధమవుతోంది. కొత్త పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. చివరగా 2014లో J&K అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు BJP-PDP కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగా ముఫ్తీ మహ్మద్ సయ్యద్ CMగా ఎన్నికయ్యారు. 2016లో ఆయన మరణానంతరం కూతురు మెహబూబా ముఫ్తీ CM అయ్యారు. అయితే 2016లో PDPకి BJP మద్దతు ఉపసంహరించుకోవడంతో J&Kలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.
Similar News
News November 29, 2024
అదానీ, స్టాలిన్ సీక్రెట్ మీటింగ్.. Xలో రచ్చ
అదానీపై అమెరికా కోర్టులో అభియోగాల వివాదం తమిళనాడు రాజకీయాలను షేక్ చేస్తోంది. CM స్టాలిన్ కొన్నేళ్ల ముందు గౌతమ్ అదానీతో రహస్యంగా సమావేశమయ్యారన్న సమాచారం, వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. #AdaniStalinSecretMeet హ్యాష్‌ట్యాగ్ Xలో ట్రెండ్ అవుతోంది. US ఛార్జిషీట్లో ఇండియా కూటమి పార్టీ పాలిస్తున్న TN పేరూ ఉంది. తమ ప్రతినిధులపై లంచం అభియోగాలు నమోదవ్వలేదని అదానీగ్రూప్ ఖండించడం తెలిసిందే.
News November 29, 2024
ఎకరాకు రూ.12 వేల బోనస్.. తృప్తిని ఇస్తోంది: సీఎం రేవంత్
TG: సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు ₹500 చొప్పున బోనస్ చెల్లిస్తోందని CM రేవంత్ తెలిపారు. ‘ఎకరాకు 20-24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తోంది. బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు ఎకరాకు ₹10వేల నుంచి ₹12వేల వరకు అదనపు ఆదాయం అందుతోంది’ అనే వార్తను Xలో షేర్ చేశారు. ‘రైతన్నలకు ఎకరాకు ₹12 వేల బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవ”సాయా”న్ని పండగ చేసే ఈ ప్రయత్నం గొప్ప తృప్తిని ఇస్తోంది’ అని పేర్కొన్నారు.
News November 29, 2024
వివేకా హత్య కేసు.. భాస్కర్ రెడ్డికి సుప్రీం నోటీసులు
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లతోపాటు దీన్ని జతచేయాలని సునీత తరఫు లాయర్ కోరారు. దీంతో ఆ మేరకు సుప్రీం ఆదేశాలిచ్చింది.