News June 8, 2024
మోదీ ప్రమాణ స్వీకారానికి 7 పొరుగు దేశాల లీడర్లు
రేపు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశాల లీడర్లు రానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అఫీఫ్, మారిషస్ PM ప్రవింద్, నేపాల్ PM పుష్ప కమల్ దహల్, భూటాన్ PM షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ PM షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు హాజరుకానున్నారు. కొన్ని నెలలుగా భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ముయిజ్జు రానుండటం ఆసక్తికరంగా మారింది.
Similar News
News November 29, 2024
కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారు: ఎర్రబెల్లి
TG: త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడవద్దని సూచించారు.
News November 29, 2024
అదానీ, స్టాలిన్ సీక్రెట్ మీటింగ్.. Xలో రచ్చ
అదానీపై అమెరికా కోర్టులో అభియోగాల వివాదం తమిళనాడు రాజకీయాలను షేక్ చేస్తోంది. CM స్టాలిన్ కొన్నేళ్ల ముందు గౌతమ్ అదానీతో రహస్యంగా సమావేశమయ్యారన్న సమాచారం, వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. #AdaniStalinSecretMeet హ్యాష్‌ట్యాగ్ Xలో ట్రెండ్ అవుతోంది. US ఛార్జిషీట్లో ఇండియా కూటమి పార్టీ పాలిస్తున్న TN పేరూ ఉంది. తమ ప్రతినిధులపై లంచం అభియోగాలు నమోదవ్వలేదని అదానీగ్రూప్ ఖండించడం తెలిసిందే.
News November 29, 2024
ఎకరాకు రూ.12 వేల బోనస్.. తృప్తిని ఇస్తోంది: సీఎం రేవంత్
TG: సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు ₹500 చొప్పున బోనస్ చెల్లిస్తోందని CM రేవంత్ తెలిపారు. ‘ఎకరాకు 20-24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తోంది. బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు ఎకరాకు ₹10వేల నుంచి ₹12వేల వరకు అదనపు ఆదాయం అందుతోంది’ అనే వార్తను Xలో షేర్ చేశారు. ‘రైతన్నలకు ఎకరాకు ₹12 వేల బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవ”సాయా”న్ని పండగ చేసే ఈ ప్రయత్నం గొప్ప తృప్తిని ఇస్తోంది’ అని పేర్కొన్నారు.