News June 8, 2024
రామోజీరావుతో మాటలు గుర్తొస్తున్నాయ్: RRR

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకి ఉండి నియోజకవర్గ MLA కనుమూరి రఘురామ కృష్ణరాజు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 నెలల క్రితం ఆయనతో కలిసి 2 గంటల పాటు మాట్లాడిన మాటలు ఇప్పటికీ తనకు గుర్తొస్తున్నాయని అన్నారు. గొప్ప పట్టుదల, క్రమశిక్షణ, వ్యక్తిత్వం కోటికి ఒక్కరిలోనే ఉంటాయని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Similar News
News November 7, 2025
భీమవరం: క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీ

ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధిని నూరు శాతం నిరోధించవచ్చని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే, వ్యాధి నుంచి కోలుకునే అవకాశం గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే రామాంజనేయులు, ఎస్పీ నయీం అస్మీ పాల్గొన్నారు.
News November 7, 2025
జావెలిన్ త్రోలో కొంతేరు కుర్రాడి సత్తా

యలమంచిలి(M) కొంతేరు ZPHS 9వ తరగతి విద్యార్థి పెదపూడి అరుణ్ కుమార్ అండర్-17 బాలుర జావెలిన్ త్రో విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం డి. రాంబాబు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెదవేగిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అరుణ్ కుమార్ 42 మీటర్లు జావెలిన్ విసిరి ప్రథమ స్థానం సాధించాడు. ఈ నెల 22న వినుకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో అరుణ్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
News November 7, 2025
ప.గో: మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీలు

ప.గో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి సహా 141 మంది అధికారులు 141 పాఠశాలల్లో పరిశీలించారు. ఇటీవల కాళ్లలో కుళ్లిన కోడిగుడ్లు బయటపడటంతో అధికారులు గుడ్లను నిశితంగా పరిశీలించారు. జిల్లాలో సుమారు 80 వేల మంది విద్యార్థులకు భోజనం అందుతోందని అధికారులు తెలిపారు.


