News June 8, 2024

HYD: రామోజీరావుకు నివాళులర్పించిన KTR

image

HYD రామోజీ ఫిలిం సిటీలో ఈనాడు అధినేత రామోజీరావు పార్థివదేహానికి ఈరోజు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నివాళులర్పించారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ.. రామోజీరావు మరణించడం చాలా బాధాకరమన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారని, మీడియా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులున్నారు.

Similar News

News November 29, 2024

REWIND: KCR అరెస్ట్.. NIMS‌లోనే దీక్ష విరమణ

image

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణ‌భవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.

News November 29, 2024

HYD: సైకో.. యువతిని చంపేసి అత్యాచారం!

image

సైకో కిల్లర్‌ రాహుల్ కేసులో‌ భయంకర నిజాలు వెలుగుచూశాయి. ఈ నెల 14న ఓ యువతిని హత్యాచారం చేసిన కేసులో వల్సాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. హత్య చేసి అదే మృతదేహాం పక్కన నిద్రించే అలావాటు రాహుల్‌కు ఉందని గుర్తించారు. సదరు యువతి(19)ని తోటలో చంపిన తర్వాత రెండోసారి అత్యాచారం చేశాడన్నారు. అయితే, <<14729624>>సికింద్రాబాద్-మణుగూరు<<>> రైలులో రమణమ్మను చంపిన ఈ నరహంతకుడిని HYD తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

News November 29, 2024

HYD: అప్పు చేసి పిల్లలకు వంట చేస్తున్నారు: CITU

image

మధ్యాహ్న భోజన పథకం కార్మికులు MEO ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. CITU జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్ మాట్లాడారు. కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, మెనూ ఛార్జీలు పెండింగులో ఉన్నాయన్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతూ.. కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.