News June 8, 2024

నితీశ్‌కు పీఎం పదవి ఆఫరిచ్చారు: కేసీ త్యాగి

image

సీఎం నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి పీఎం పోస్ట్ ఆఫర్ చేసిందని జేడీయూ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. అయితే ఆ ఆఫర్‌ను తాము వెంటనే తిరస్కరించామని స్పష్టం చేశారు. ‘మేము ఎన్డీఏ కూటమిలో భాగస్వాములం. మోదీకి మా అధినేత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇందులో మరో ఆలోచన లేదు’ అని కేసీ త్యాగి చెప్పారు.

Similar News

News January 30, 2025

ఘోర విమాన ప్రమాదం.. 60 మందికి పైగా దుర్మరణం!

image

USలోని వాషింగ్టన్‌లో రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన <<15306564>>విమాన ప్రమాదంలో<<>> ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు బయటపడ్డాయి. విమానంలో 60 మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఎవరూ బతికి ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. విమాన శకలాలు పడిన పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రత -1 నుంచి -2 సెల్సియస్ మధ్య ఉంది. ఈ పరిస్థితుల్లో మనుషులు 30-90 నిమిషాలు మించి జీవించలేరని నిపుణులు చెబుతున్నారు.

News January 30, 2025

తల్లి మృతి.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

image

ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ తన తల్లి లివి సురేశ్ బాబును గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘అమ్మా, నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమతో పాటు నా కలలను సాకారం చేసుకునే శక్తినిచ్చావు. నువ్వు నన్ను వదిలి వెళ్లిపోలేదమ్మా. ఎప్పుడూ నా హృదయంలో, నా ప్రతి అడుగులో ఉంటావు. మీ ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. నువ్వే నా బలం అమ్మా’ అని ఫేస్‌బుక్‌ పోస్టులో రాసుకొచ్చారు.

News January 30, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి బెయిల్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌, అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని షరతు పెట్టింది. పాస్ పోర్టులు సమర్పించాలని, దర్యాప్తునకు సహకరించాలని ఇద్దరినీ ఆదేశించింది. ఇదే కేసులో తిరుపతన్నకు కూడా కోర్టు ఇటీవలే బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.