News June 8, 2024

ఫ్రెంచ్ ఓపెన్‌లో ధోనీ సందడి

image

ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ సందడి చేశారు. టెన్నిస్ స్టార్స్ అల్కరాజ్-సిన్నర్ మధ్య జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ను తన స్నేహితులతో కలిసి మహీ వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్ 2024 సీజన్ ముగిశాక ధోనీ విహారయాత్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పలు దేశాలను చుట్టేస్తున్నారు.

Similar News

News January 11, 2025

యశస్వీ జైస్వాల్‌కు మరోసారి నిరాశే

image

టీమ్ ఇండియా క్రికెటర్ యశస్వీ జైస్వాల్‌కు మరోసారి బీసీసీఐ మొండిచేయి చూపింది. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. బీజీటీలో రాణించిన జైస్వాల్‌‌ను టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జైస్వాల్ అద్భుత ఫామ్‌ను బీసీసీఐ వృథా చేస్తోందని మండిపడుతున్నారు. గత ఐపీఎల్‌లో కూడా ఆయన రాణించారని, సెలక్ట్ చేయాల్సిందని కామెంట్లు చేస్తున్నారు.

News January 11, 2025

‘ఇండియన్-2’ లైఫ్ టైమ్ కలెక్షన్లు క్రాస్ చేసిన ‘గేమ్ ఛేంజర్’!

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రెండో రోజూ భారీగానే కలెక్షన్లు వస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ‘గేమ్ ఛేంజర్’ వసూళ్లు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు-2’ లైఫ్ టైమ్ కలెక్షన్లు దాటేసినట్లు తెలిపాయి. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.151 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. కాగా, ‘గేమ్ ఛేంజర్’ మొదటి రోజే రూ.186 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం.

News January 11, 2025

సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే?

image

సంక్రాంతి రైతుల పండుగ. ఈ పండుగ నాటికి అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. ఆ సంతోషంలోనే ఈ పండుగ జరుపుకుంటారు. తమకు సహాయం చేసిన పశువులను పూజిస్తారు. కూలీలకు పండిన ధాన్యంలో కొంత ఇస్తారు. గంగిరెద్దులు, హరిదాసులు, జంగాలు అందరూ సంక్రాంతికే కనిపిస్తారు. వారందరికీ ప్రజలు సంతోషంగా దానధర్మాలు చేస్తారు. ప్రజలు ఒకరితో మరొకరు కృతజ్ఞతతో మెలగాలని చాటి చెప్పడమే ఈ పండుగ ఉద్దేశం.