News June 8, 2024

ఈనాడు తొలి సంచిక చూశారా?

image

రామోజీరావు ఈనాడు పత్రికను 1974లో ప్రారంభించారు. అదే ఏడాది AUG 10న తొలి సంచిక వెలువడింది. రామోజీ మరణంతో ఈనాడు తొలి సంచిక ఫొటోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. USలో సంచలనం సృష్టించిన వాటర్ గేట్ వివాదంతో ఆ దేశ అధ్యక్షుడు నిక్సన్ రాజీనామా చేసిన వార్తను ’ఎట్టకేలకు నిక్సన్ నిష్క్రమణ‘ అంటూ తొలి పేజీలో ప్రధానంగా ప్రచురించారు. మరో 2 నెలల్లో ఈ పత్రిక ప్రచురణ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తి కానుంది.

Similar News

News March 28, 2026

రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త

image

ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ షాపులకు రైస్‌ను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 18 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం FCI వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉండటంతో కొత్తగా వచ్చే ధాన్యానికి చోటు లేకుండా పోయింది. వాటిని ఖాళీ చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 28, 2026

విశాఖ పోర్టుకు భారీ LPG నౌక

image

విశాఖపట్నం పోర్టుకు BW Birch అనే భారీ LPG నౌక చేరుకుంది. సుమారు 24 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ సామర్థ్యంతో వచ్చిన ఈ నౌక ప్రస్తుతం అన్‌లోడింగ్ ప్రక్రియలో ఉంది. స్థానిక ఇంధన అవసరాలను తీర్చడంలో ఈ సరకు అత్యంత కీలకం కానుంది. పోర్ట్ అధికారుల పర్యవేక్షణలో గ్యాస్‌ను సేఫ్‌గా నిల్వ కేంద్రాలకు తరలిస్తున్నారు. దేశంలోని ప్రధాన ట్రాన్స్‌షిప్‌మెంట్ కేంద్రాల ద్వారా ఈ భారీ నౌక విశాఖకు చేరుకోవడం విశేషం.

News March 28, 2026

ఏ వయసు వారు ఎంత సేపు నడవాలి?

image

ఫిట్‌గా ఉండటానికి నడక ఒక ఈజీ మార్గం. వయసును బట్టి ఎంత సేపు నడవాలో డాక్టర్లు చెప్పారు. 5-12 ఏళ్ల పిల్లలు రోజుకు 60 నిమిషాలు, టీనేజర్లు 45-60 నిమిషాలు నడవాలి. 20-40 ఏళ్ల వారు 30-45 నిమిషాలు, మిడిల్ ఏజ్ వారు 30-40 నిమిషాలు వాకింగ్ చేస్తే BP కంట్రోల్‌లో ఉంటుంది. 60 దాటిన వారు రోజుకు 20-30 నిమిషాలు నడిస్తే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇలా రెగ్యులర్‌గా నడిస్తే బాడీతో పాటు బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుంది.