News June 9, 2024
చంద్రబాబు ప్రమాణం 12న ఉ.11.27 గంటలకే

సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార సమయం విషయంలో ఏపీ సీఎంవో X అకౌంట్‌లో పొరపాటు జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ నెల 12న ఉ.9.27 గంటలకు CBN ప్రమాణం చేస్తారని తొలుత ట్వీట్ చేశారు. కాసేపటికి దాన్ని డిలీట్ చేసి ఉ.11.27 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News September 13, 2025
ట్యాబ్లెట్ వేసుకోగానే నొప్పి ఎలా తగ్గుతుందంటే?

శరీరంలో ప్రతి మందుకీ ప్రత్యేకమైన గ్రాహకాలు(రిసెప్టార్లు) ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘పేగులు, రక్తంలో కలిసి కాలేయం గుండా వెళ్లినప్పుడు మందు కొంత కరుగుతుంది. మిగిలినది గుండెకు చేరి అక్కడి నుంచి శరీరమంతా చేరుతుంది. ఒళ్లంతా వెళ్లినా పనిచేయాల్సిన గ్రాహకాలు కొన్ని భాగాల్లోనే ఉంటాయి. ఉదా.. పెయిన్ కిల్లర్ మందు మెదడులోని ఓపియాయిడ్ గ్రాహకాలను ఉత్తేజం చేసి నొప్పిని తగ్గేలా చేస్తుంది’ అని పేర్కొన్నారు.
News September 13, 2025
పసికూనపైనా పాక్ చెత్త ప్రదర్శన!

ఆసియా కప్ 2025లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు అంతంత మాత్రం ప్రదర్శన చేసి అబాసు పాలవుతోంది. నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 7 వికెట్ల నష్టానికి 160 పరుగులే చేసింది. మహ్మద్ హ్యారిస్(66), ఫర్హాన్(29), ఫకర్ జమాన్(23) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కెప్టెన్ సల్మాన్ అఘా, ఓపెనర్ అయూబ్ గోల్డెన్ డక్ కావడం గమనార్హం. ఒమన్ బౌలర్లలో ఫైజల్, ఖలీమ్‌లకు చెరో 3 వికెట్లు, మహ్మద్ నదీమ్ ఒక వికెట్ తీశారు.
News September 12, 2025
ఆందోళన కలిగిస్తున్న గుండెపోటు మరణాలు!

గుండెపోటుతో సాధారణ ప్రజలే కాదు డాక్టర్లూ మరణిస్తున్నారు. ఆర్మీలో వైద్యుడిగా సేవలందిస్తోన్న మేజర్ విజయ్ కుమార్ (మధ్యప్రదేశ్) కూర్చున్న చోటే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కారులో చాలాసేపు కదలకుండా కూర్చోవడం గమనించి పాదచారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు. ఇటీవలే చెన్నైలోనూ ఓ కార్డియాలజిస్ట్ కూడా గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే.