News June 9, 2024
రేసులో ముందున్న ఈటల, డీకే అరుణ?
TG: కేంద్రంలో నరేంద్ర మోదీ కేబినెట్ రేపు కొలువుదీరే అవకాశముంది. పీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు మంత్రి వర్గ కూర్పు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్ కేంద్ర మంత్రుల రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కిషన్ రెడ్డికి మరోసారి బెర్త్ కన్ఫామ్ చేస్తారా లేదా ధర్మపురి అర్వింద్, బండి సంజయ్‌లవైపు అధిష్ఠానం మొగ్గు చూపుతుందా అనేది రేపు క్లారిటీ రానుంది.
Similar News
News January 12, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 12, 2025
షమీ ఈజ్ బ్యాక్.. పంత్‌పై వేటు
దాదాపు ఏడాది విరామం తర్వాత షమీ భారత జట్టులోకి తిరిగి వచ్చారు. 2023 వన్డే WCలో గాయంతో దూరమైన ఆయన ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపికయ్యారు. మరోవైపు BGTలో ఆశించినంతగా ఆకట్టుకోని రిషభ్ పంత్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. వికెట్ కీపర్ కం బ్యాటర్లుగా శాంసన్, జురేల్‌ను ఎంపిక చేశారు. కాగా తొలి టీ20 ఈ నెల 22న కోల్‌కతాలో జరగనుంది.
News January 12, 2025
విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు వైద్యులకు ₹11.42 కోట్ల జరిమానా
మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఇద్దరు వైద్యులు ₹11.42 Cr నష్టపరిహారం చెల్లించాలని మలేషియా కోర్టు ఆదేశించింది. 2019లో పునీతకు బిడ్డ జన్మించాక తీవ్ర రక్తస్రావమైంది. ప్లాసెంటా వల్ల రక్తస్రావం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పిన డా.రవి డ్రింక్స్ బ్రేక్‌కు వెళ్లారు. కొద్దిసేపటికే పునీత మృతి చెందారు. క్లినిక్ యజమాని Dr.షణ్ముగం, Dr.రవిని బాధ్యులను చేసి ₹11.42 Cr బాధితులకు చెల్లించాలంది.