News June 9, 2024
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక కోరిన సీఎస్

AP: నూతన CSగా బాధ్యతలు స్వీకరించిన నీరభ్ కుమార్ తన పని మొదలుపెట్టారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేసి తనకు సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు CMగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల భద్రత, వారి వాహనాల పార్కింగ్ సదుపాయాలపై దృష్టిపెట్టాలన్నారు.
Similar News
News September 13, 2025
పసికూనపైనా పాక్ చెత్త ప్రదర్శన!

ఆసియా కప్ 2025లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు అంతంత మాత్రం ప్రదర్శన చేసి అబాసు పాలవుతోంది. నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 7 వికెట్ల నష్టానికి 160 పరుగులే చేసింది. మహ్మద్ హ్యారిస్(66), ఫర్హాన్(29), ఫకర్ జమాన్(23) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కెప్టెన్ సల్మాన్ అఘా, ఓపెనర్ అయూబ్ గోల్డెన్ డక్ కావడం గమనార్హం. ఒమన్ బౌలర్లలో ఫైజల్, ఖలీమ్‌లకు చెరో 3 వికెట్లు, మహ్మద్ నదీమ్ ఒక వికెట్ తీశారు.
News September 12, 2025
ఆందోళన కలిగిస్తున్న గుండెపోటు మరణాలు!

గుండెపోటుతో సాధారణ ప్రజలే కాదు డాక్టర్లూ మరణిస్తున్నారు. ఆర్మీలో వైద్యుడిగా సేవలందిస్తోన్న మేజర్ విజయ్ కుమార్ (మధ్యప్రదేశ్) కూర్చున్న చోటే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కారులో చాలాసేపు కదలకుండా కూర్చోవడం గమనించి పాదచారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు. ఇటీవలే చెన్నైలోనూ ఓ కార్డియాలజిస్ట్ కూడా గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే.
News September 12, 2025
ట్రంప్ సన్నిహితుడి హత్య.. ఎందుకు చంపాడంటే?

ట్రంప్ సన్నిహితుడు ఛార్లీ కిర్క్‌ను గన్‌తో కాల్చి చంపిన కేసులో నిందితుడు టేలర్ రాబిన్‌సన్(22)ను US పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు విడుదల చేసిన ఫొటోల్లో ఉన్నది టేలరేనని అతడి తండ్రి గుర్తించి లొంగిపోమని చెప్పాడు. ఓ పాస్టర్‌ను సాయం కోరగా ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ‘కిర్క్ పొలిటికల్, విద్వేష ప్రసంగాలు చేస్తున్నాడు’ అని హత్యకు ముందు రోజు రాత్రి టేలర్ ఇంట్లో చెప్పినట్లు అతడి తండ్రి తెలిపారు.