News June 9, 2024
INDvsPAK: ఆ సీటుకు రీసేల్‌లో రూ.1.46 కోట్లు!

T20WCలో ఇవాళ న్యూయార్క్ వేదికగా IND-PAK మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. టికెట్లను రీసేల్‌కు పెడుతున్నారు. ఓ వ్యక్తి సెక్షన్ 252లోని 20వ వరుసలో 30వ సీటును ఏకంగా $1.75 లక్షల(₹1.46 కోట్లు)కు ఓ వెబ్‌సైట్‌లో బేరం పెట్టాడు. అయితే దాన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. కాగా నసావు స్టేడియంలో టికెట్ రేట్లు $1,500-$10,000 మధ్య ఉన్నాయి.
Similar News
News September 10, 2025
కేంద్ర సహకారంతో త్వరలో రాజధాని పూర్తవుతుంది: మాధవ్

AP: ఏడాదిలో రూ.9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ తెలిపారు. ‘సూపర్ సిక్స్ పథకాలను ఇతర రాష్ట్రాలూ ప్రశంసిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సాయం అందజేస్తోంది. అమరావతికి ప్రత్యేకంగా రూ.15వేల కోట్ల గ్రాంట్ ఇస్తున్నాం. కేంద్ర సహకారంతో త్వరలో ప్రజా రాజధాని పూర్తవుతుంది. త్వరలో ఏపీ సెమీ కండక్టర్ హబ్‌గా మారబోతోంది’ అని అనంతపురం సభలో పేర్కొన్నారు.
News September 10, 2025
విజయవాడలో వే2న్యూస్ కాన్‌క్లేవ్

నవ్యాంధ్రప్రదేశ్‌ను రాబోయే పదేళ్లలో ఎలా చూడబోతున్నామో ప్రభుత్వం, ఇండస్ట్రీ నిపుణులు వివరించే వేదిక Way2News కాన్‌క్లేవ్. విజయవాడ CK కన్వెన్షన్‌లో ఈనెల 12న జరిగే తొలి డిజిటల్ మీడియా సదస్సులో CM చంద్రబాబు, విపక్ష నేతలు పాల్గొంటున్నారు. అటు గీతం విద్యాసంస్థల ఛైర్మన్, వైజాగ్ ఎంపీ భరత్, అమలాపురం ఎంపీ హరీశ్ బాలయోగి కూడా వేదికపై తమ ఆలోచనలు, రోడ్ మ్యాప్ పంచుకోబోతున్నారు.
Note: Entry By Invitation Only
News September 10, 2025
హీరోయిన్ నయనతారకు నోటీసులు

హీరోయిన్ నయనతారకు తమిళనాడు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. <<14567761>>డాక్యుమెంటరీ<<>>లో చంద్రముఖి మూవీ క్లిప్స్‌ను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్మాతలు కోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు ‘నేను రౌడీనే’ క్లిప్ వాడటంపై ఆ మూవీ నిర్మాత ధనుష్ సైతం కోర్టును ఆశ్రయించారు. వీటిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు మూవీ క్లిప్‌లు వాడటంపై అక్టోబర్ 6లోపు సమాధానమివ్వాలని నయనతార, నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది.