News June 9, 2024

మోదీ కేబినెట్‌లోకి అన్నామలై?

image

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఖాయమైనట్లు సమాచారం. ఈ మేరకు ఆయనకు పీఎంవో అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో అన్నామలై ఓటమిపాలైనా రాష్ట్రాధ్యక్షుడిగా తమిళనాడులో పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించారు. గతంలో 3 శాతం మేర ఉన్న బీజేపీ ఓటు బ్యాంక్‌ను 11 శాతానికి చేర్చారు. దీంతోనే ఆయనకు కేబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 12, 2025

రిపబ్లిక్ డే పరేడ్‌కు రాష్ట్రం నుంచి 41 మంది

image

TG: న్యూఢిల్లీలోని కర్తవ్య్‌పథ్‌లో నిర్వహించే గణతంత్ర వేడుకలకు 41 మంది రాష్ట్ర వాసులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో పాటు ప్రత్యేక విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ పరేడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా రాజేశ్వర్ ఉండనుండగా ట్రెయినీ డీజీటీ శ్రావ్యతో పాటు మన్ కీ బాత్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న 15 మంది అభ్యర్థులు ఉన్నారు.

News January 12, 2025

నేడు మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన ఆరుగురి కుటుంబాలకు నేడు టీటీడీ చెక్కులు పంపిణీ చేయనుంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని బృందాలు వైజాగ్, నర్సీపట్నం, తమిళనాడు, కేరళలోని మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లనున్నాయి. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున చెక్కు ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, ఉచిత విద్యను అందించేందుకు వివరాలు సేకరించనున్నాయి.

News January 12, 2025

యువతకు స్ఫూర్తి ప్రదాత.. వివేకానంద

image

భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటిన తత్వవేత్త స్వామి వివేకానంద. దేశ సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తి చేయడంలో ఆయన నిరంతరం కృషి చేశారు. 1893లో చికాగోలో హిందుత్వాన్ని పరిచయం చేస్తూ చేసిన ప్రసంగంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. యువతే దేశ అభివృద్ధికి పునాదులు అంటూ నిరంతరం ప్రోత్సహించేవారు. ఆయనకు గౌరవ సూచకంగా వివేకానంద జయంతి(JAN 12)ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.