News June 9, 2024
మోదీ 3.O సర్కారుపై సైకత శిల్పం

ప్రముఖ సైకత శిల్పి, ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ తన కళా ప్రతిభను మరోసారి చాటి చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి కొలువుదీరనున్న వేళ అభినందనలు తెలుపుతూ ఆయన సైకత శిల్పాన్ని రూపొందించారు. పూరీ తీరంలో తీర్చిదిద్దిన ఈ కళాత్మక చిత్రం ఆకట్టుకుంటోంది. దీనికి ‘మోదీ 3.O.. వికసిత్ భారత్’ అని క్యాప్షన్ ఇచ్చారు.
Similar News
News September 10, 2025
AEE ఫలితాలు విడుదల

AP పొల్యూషన్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను APPSC విడుదల చేసింది. అభ్యర్థులు https://psc.ap.gov.inలో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చని తెలిపింది. 2023లో 21 AEE పోస్టుల భర్తీకి బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నెలకు రూ.57,100-రూ.1,47,760 వరకు జీతం రానుంది.
News September 10, 2025
కరిష్మా పిల్లలకు రూ.1,900 కోట్లు అందాయి: సంజయ్ భార్య

వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ఆస్తిలో రెండో భార్య కరిష్మా కపూర్ పిల్లలు <<17658065>>వాటా<<>> కోరడంపై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా ఆ పిల్లలకు రూ.1,900 కోట్లు అందాయని మూడో భార్య ప్రియా సచ్‌దేవ్ కోర్టుకు తెలిపారు. సంజయ్ వీలునామా చెల్లుబాటును కోర్టు ప్రశ్నించింది. సంజయ్ ఆస్తుల వివరాలను సమర్పించాలని ప్రియా సచ్‌దేవ్‌ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.
News September 10, 2025
అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా SIR!

ఓటర్ జాబితా రీవెరిఫికేషన్‌కు సంబంధించి బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(<<17634931>>SIR<<>>) త్వరలో దేశవ్యాప్తంగా జరగనున్నట్లు సమాచారం. OCT నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్‌తో జరిగిన మీటింగ్‌లో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెలలోనే గ్రౌండ్ వర్క్ పూర్తిచేస్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం.