News June 9, 2024
T20 WCలో పాక్‌పై భారత్‌దే పైచేయి

T20 WC చరిత్రలో భారత్, పాక్ ఇప్పటివరకు 7సార్లు తలపడ్డాయి. టీమ్‌ఇండియా 6 మ్యాచుల్లో గెలవగా, పాక్ ఒక్క మ్యాచులోనే నెగ్గింది. 2007లో గ్రూప్ మ్యాచ్, ఫైనల్‌తో పాటు 2012, 2014, 2016, 2022లో PAKపై IND విజయం సాధించింది. 2021లో భారత్‌పై పాక్ గెలిచింది. ప్రస్తుత ఫామ్ చూసుకుంటే నేటి మ్యాచ్‌లో INDకే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంది. రా.8కి ప్రారంభమయ్యే ఈ మ్యాచును star sports ఛానల్, hotstarలో చూడవచ్చు.
Similar News
News September 10, 2025
ప్రాక్టీస్ షురూ చేసిన హిట్‌మ్యాన్

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం రెడీ అవుతున్నారు. తాజాగా ముంబైలో ప్రాక్టీస్ ప్రారంభించారు. అభిషేక్ నాయర్ ట్రైనింగ్‌లో బరువు తగ్గిన రోహిత్.. రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో మూడు వన్డేలు జరగనున్నాయి. అటు 2027 వన్డే ప్రపంచకప్ వరకు హిట్‌మ్యాన్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News September 10, 2025
చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (A-38)కి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. గతంలోనూ చెవిరెడ్డి పిటిషన్ న్యాయస్థానం కొట్టేసింది. కాగా ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరైంది.
News September 10, 2025
62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది: ఉపరాష్ట్రపతి తల్లి

ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికవడం పట్ల ఆమె తల్లి జానకీ అమ్మాల్ హర్షం వ్యక్తం చేశారు. ‘నాకు కొడుకు పుట్టినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన లాగే నేను కూడా టీచర్‌గా పనిచేశాను. ఆయన పేరునే నా కుమారుడికి పెట్టాను. ఏదో ఒక రోజు తను ప్రెసిడెంట్ అవ్వాలనే ఆ పేరు పెడుతున్నావా అని నా భర్త అడిగారు. 62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.