News June 9, 2024
వరంగల్: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు 72.8% హాజరు
హంటర్ రోడ్‌లోని గ్రీన్ వుడ్ పాఠశాల, బిర్లా ఓపెన్ మైండ్ పాఠశాల పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తీరును, పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి.. పరీక్ష సజావుగా జరిగినట్లు తెలిపారు. జిల్లాలో ఈ పరీక్షకు 9902 మంది అభ్యర్థులకు గాను 6622 మంది 72.8 శాతంతో హాజరయ్యారు.
Similar News
News November 30, 2024
వరంగల్: ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే అవకాశం పోలీసులకు మాత్రమే: సీపీ
తొమ్మిది నెలలు శిక్షణను పూర్తిచేసుకుని విధులు నిర్వహించేందుకు సిద్ధమైన 578 మంది కానిస్టేబుళ్లతో సీపీ అంబర్ కిషోర్ ఝా శనివారం సమావేశం నిర్వహించారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే అవకాశం పోలీసులకు మాత్రమే ఉంటుందన్నారు. ప్రజల మన్ననలు పొందేవిధంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
News November 30, 2024
టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా జనగామ వాసి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా జనగామ మండలం ఓబుల్ కేశ్వపూర్ గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. డిసెంబర్ 3న ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ మేరకు వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
News November 30, 2024
వరంగల్: అన్నారం షరీఫ్‌లో వ్యక్తి మృతి
వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. పోలీసుల వివరాలు.. పర్వతగిరి మం. అన్నారం షరీఫ్‌లోని ఓ హోటల్లో గోరుకాటి చేరాలు(50) పని చేస్తున్నాడు. పెద్దతండాకు చెందిన ఓ వ్యక్తి తాగిన మైకంలో చేరాలును శనివారం తెల్లవారుజామున ఆటోలో తీసుకెళ్లాడు. విపరీతంగా కొట్టి అన్నారం కెనరా బ్యాంక్ ఎదురుగా పడేశాడు. ఉదయాన్నే అటుగా వెళ్లే అయ్యప్ప భక్తులు గాయాలతో ఉన్న చేరాలును గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు.