News June 9, 2024
రేపే కల్కి 2898 AD ట్రైలర్.. నెల్లూరులోని ఈ థియేటర్లో స్క్రీనింగ్!
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్ రేపు విడుదలకానుంది. నెల్లూరు జిల్లా అభిమానుల కోసం జిల్లాలోని పలు థియేటర్లలో రేపు 6PMకు ట్రైలర్ విడుదల చేస్తున్నారు. నెల్లూరు – లీలా మహాల్, సూళ్లూరుపేట- V EPIQ, గూడూరు- సంగం, కావలి- మాసన స్రీన్-1 థియేటర్‌లలో ట్రైలర్ స్క్రీనింగ్ చేస్తారు. SHARE IT
Similar News
News January 20, 2025
ఇవాళ సూళ్లూరుపేటకు రానున్న కృతిశెట్టి, సంయుక్త
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సూళ్లూరుపేటకు ప్రముఖ హీరోయిన్లు రానున్నారు. వారిలో ఉప్పెన ఫేం కృతిశెట్టి, విరూపాక్ష ఫేం సంయుక్త సింగర్ మంగ్లీతోపాటూ పలువురు ఢీ తారాగణం ఉన్నారు. వారితోపాటూ యాంకర్ రవి, కావ్య సందడి చేయనున్నారు. మరోవైపు మంత్రులు ఆనం, అనగాని సత్య ప్రసాద్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
News January 19, 2025
ఇవాళ సూళ్లూరుపేటకు రానున్న ప్రముఖులు వీరే
సూళ్లూరుపేటలో ఆదివారం ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు నేడు సూళ్లూరుపేటకు రానున్నారు. వారిలో నటి, యాంకర్ అనసూయ, అషు రెడ్డి, యాంకర్ రేణు, సింగర్ గాయత్రి, రఘురామ్, కొరియోగ్రాఫర్ సత్య, చైల్డ్ సింగర్ సాయి వాగ్ దేవి, మిమిక్రీ ఆర్టిస్ట్ షరీఫ్ తదితరులు ఉన్నారు.
News January 19, 2025
HYD ఓయో రూమ్‌లలో ఉంటూ గంజాయి వ్యాపారం
హైదరాబాదు ధూల్‌పేట జాలీ హనుమాన్ దేవాలయం వద్ద ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. వారు మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌కి చెందిన సంజన మాంజా(18), నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాజు(25) ఓయో రూమ్‌లలో అద్దెకు ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నారని వారు తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి వారిని పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 3.625 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.