News June 9, 2024

ఒక్క ఓవర్ పడగానే మళ్లీ వర్షం

image

భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం పదేపదే అంతరాయం కలిగిస్తోంది. ఇప్పటికే వాన వల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ పడగానే మళ్లీ చిరుజల్లులు మొదలయ్యాయి. దీంతో మ్యాచ్ ఆగిపోయింది.

Similar News

News January 12, 2025

పార్కింగ్ స్థలం ఉంటేనే కారు రిజిస్ట్రేషన్?

image

కారు కొనాలంటే డబ్బులుంటే చాలు అనుకుంటున్నారా? దానిని పార్క్ చేసుకునేందుకు స్థలం కూడా ఉండాలంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ట్రాఫిక్‌ నియంత్రణ, కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం ఫడణవీస్ కొత్త రూల్ తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం కారు రిజిస్ట్రేషన్ సమయంలో ‘పార్కింగ్ ఏరియా’ సర్టిఫికెట్ సమర్పించాలి. ముంబై, నాగ్‌పుర్, పుణేతో సహా కీలక పట్టణాల్లో ఈ రూల్ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మీ కామెంట్?

News January 12, 2025

BREAKING: వెంకటేశ్, రానాలపై కేసు నమోదు

image

హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై సినీ నటులు వెంకటేశ్, రానా, అభిరామ్‌, సురేశ్ బాబులపై కేసు నమోదైంది. సిటీ సివిల్ కోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉండగా డెక్కన్ కిచెన్ కూల్చివేశారని లీజుకు తీసుకున్న నందకుమార్ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. వారిపై కేసు నమోదు చేయాలని ఫిలింనగర్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో 448, 452, 458, 120B సెక్షన్ల కింద పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

News January 12, 2025

దక్షిణాదిపై కేంద్రం వివక్ష: డీఎంకే మంత్రి

image

పన్నుల వాటాలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని తమిళనాడు డీఎంకే మంత్రి తంగం తెనరసు విమర్శించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 31.5 కోట్ల జనాభా ఉంటే రూ.27,336 కోట్లు కేటాయించిందని చెప్పారు. అదే యూపీ, బిహార్, MPల్లో 44.3 కోట్ల జనాభా ఉంటే రూ.62,024 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. దక్షిణాదికి 15%, ఆ 3 రాష్ట్రాలకు 40% ఇవ్వడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు.