News June 9, 2024

ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు

image

రాష్ట్రంలో వేసవి సెలవులను ఈనెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండగా తాజా మార్పుతో 13న రీఓపెన్ అవుతాయని తెలిపింది. 12న CMగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరోరోజు పొడిగించింది.

Similar News

News January 12, 2025

శ్రీవారితో రాజకీయాలు చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి: కన్నబాబు

image

AP: తిరుమల ప్రసాదాన్ని కూటమి సర్కార్ రాజకీయం చేసిందని, అలా చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని వైసీపీ నేత కన్నబాబు అన్నారు. తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తిరుపతి తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమాపణ అన్నట్లు టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతున్నారు. ఈ సంక్రాంతి పేదల పండుగ కాదు.. పచ్చ నేతల పండుగ’ అని ఆయన ధ్వజమెత్తారు.

News January 12, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ టీమ్ ఇదే

image

ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టుకు మిచెల్ శాంట్నర్ సారథ్యం వహిస్తారు. సీనియర్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇచ్చారు. జట్టు: శాంట్నర్ (C), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేవాన్ కాన్వే, లాకీ ఫెర్గ్యూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విలియమ్సన్, విల్ యంగ్.

News January 12, 2025

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టుల మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మద్దేడు పీఎస్ పరిధిలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభించాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.