News June 9, 2024

మోదీకి బిల్ గేట్స్ అభినందనలు

image

భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీకి దిగ్గజ వ్యాపార‌వేత్త బిల్ గేట్స్ అభినందనలు తెలిపారు. ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి రంగాల్లో ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్‌ను బలోపేతం చేశారని కొనియాడారు. ప్రపంచంతో పాటు భారత్‌లోని ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి నిరంతర భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News January 12, 2025

కొత్త కెప్టెన్‌ను వెతకండి: BCCIతో రోహిత్ శర్మ!

image

టీమ్ఇండియాకు కొత్త కెప్టెన్‌ను వెతకాలని BCCIకి రోహిత్ శర్మ సూచించినట్టు తెలిసింది. CT25 సహా మరికొన్ని నెలలు తననే కొనసాగించాలని కోరినట్టు సమాచారం. జట్టు ప్రదర్శనపై శనివారం బోర్డు సమీక్షలో హిట్‌మ్యాన్, కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్‌ తమ అభిప్రాయాలు చెప్పారు. బుమ్రాకు నాయకత్వం అప్పగించేందుకు కొందరు విముఖత చూపారని తెలిసింది. దీంతో ఇంగ్లాండుతో 5 టెస్టుల సిరీసుకు నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది.

News January 12, 2025

పోప్ ఫ్రాన్సిస్‌కు అమెరికా అత్యున్నత పురస్కారం

image

పోప్ ఫ్రాన్సిస్‌కు అమెరికా సర్కారు తమ అత్యున్నత పురస్కారం మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ ప్రకటించింది. ఈ నెల 20న జో బైడెన్ పదవీకాలం ముగియనుంది. ఈలోపుగా పలు కీలక నిర్ణయాల్ని ఆయన తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పోప్‌నకు పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం. కాగా.. ప్రపంచ సుస్థిరత, శాంతికి అద్భుతమైన కృషి చేసినవారికి అమెరికా మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రకటిస్తుంటుంది.

News January 12, 2025

‘డాకు మహారాజ్’ రివ్యూ & రేటింగ్

image

‘చంబల్’ నీటి కష్టాలు తీర్చేందుకు ఓ చీఫ్ ఇంజినీర్ ‘డాకు మహారాజ్’లా ఎలా మారాడనేదే ఈ సినిమా స్టోరీ. బాలయ్య క్యారెక్టర్ మేకోవర్, యాక్షన్ సీన్లు, తమన్ BGM గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు 20 ని.లు హైలైట్. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ స్లో అవుతుంది. ఎమోషన్లకు పెద్దపీట వేసి, మాస్ ఎలివేషన్లను తగ్గించారు. క్లైమాక్స్ ముందే ఊహించేలా ఉండటం మైనస్.
RATING: 2.75/5