News June 9, 2024

బాబు రాకతో భూముల ధరలకు రెక్కలు?

image

AP: మరోసారి టీడీపీ చీఫ్ చంద్రబాబు సీఎం అవుతున్న క్రమంలో అమరావతిలో భూముల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి స్థిరాస్తుల ధరలు ఏకంగా 100 శాతం పెరిగినట్లు సమాచారం. మంగళగిరి, విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో భూముల ధరలు రెండింతలైనట్లు టాక్. కాగా గత ఐదేళ్లుగా అమరావతిలో వివిధ నిర్మాణాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. బాబు ఇప్పుడు మళ్లీ అధికారం చేపట్టబోతుండటంతో అమరావతికి పునరుజ్జీవనం వచ్చినట్లు తెలుస్తోంది.

Similar News

News January 12, 2025

దక్షిణాదిపై కేంద్రం వివక్ష: డీఎంకే మంత్రి

image

పన్నుల వాటాలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని తమిళనాడు డీఎంకే మంత్రి తంగం తెనరసు విమర్శించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 31.5 కోట్ల జనాభా ఉంటే రూ.27,336 కోట్లు కేటాయించిందని చెప్పారు. అదే యూపీ, బిహార్, MPల్లో 44.3 కోట్ల జనాభా ఉంటే రూ.62,024 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. దక్షిణాదికి 15%, ఆ 3 రాష్ట్రాలకు 40% ఇవ్వడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు.

News January 12, 2025

కొత్త కెప్టెన్‌ను వెతకండి: BCCIతో రోహిత్ శర్మ!

image

టీమ్ఇండియాకు కొత్త కెప్టెన్‌ను వెతకాలని BCCIకి రోహిత్ శర్మ సూచించినట్టు తెలిసింది. CT25 సహా మరికొన్ని నెలలు తననే కొనసాగించాలని కోరినట్టు సమాచారం. జట్టు ప్రదర్శనపై శనివారం బోర్డు సమీక్షలో హిట్‌మ్యాన్, కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్‌ తమ అభిప్రాయాలు చెప్పారు. బుమ్రాకు నాయకత్వం అప్పగించేందుకు కొందరు విముఖత చూపారని తెలిసింది. దీంతో ఇంగ్లాండుతో 5 టెస్టుల సిరీసుకు నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది.

News January 12, 2025

పోప్ ఫ్రాన్సిస్‌కు అమెరికా అత్యున్నత పురస్కారం

image

పోప్ ఫ్రాన్సిస్‌కు అమెరికా సర్కారు తమ అత్యున్నత పురస్కారం మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ ప్రకటించింది. ఈ నెల 20న జో బైడెన్ పదవీకాలం ముగియనుంది. ఈలోపుగా పలు కీలక నిర్ణయాల్ని ఆయన తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పోప్‌నకు పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం. కాగా.. ప్రపంచ సుస్థిరత, శాంతికి అద్భుతమైన కృషి చేసినవారికి అమెరికా మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రకటిస్తుంటుంది.