News June 10, 2024
కేంద్ర మంత్రులుగా ఏడుగురు మాజీ సీఎంలు!
ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఇవాళ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో కుమారస్వామి (కర్ణాటక), శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), రాజ్‌నాథ్ సింగ్ (ఉత్తరప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), సర్బానంద సోనోవాల్ (అస్సాం), జితన్ రామ్ మాంఝీ (బిహార్) ఉన్నారు. వీరిలో ఐదుగురు బీజేపీ, మిగతా ఇద్దరు ఇతర పార్టీలకు చెందినవారు.
Similar News
News December 22, 2024
HYDలో భారీగా తగ్గనున్న ఇళ్ల అమ్మకాలు
HYDలో Oct-Dec క్వార్టర్‌లో ఇళ్ల అమ్మకాలు 47% తగ్గే అవకాశం ఉందని PropEquity అంచనా వేసింది. గత ఏడాది Q3తో పోలిస్తే అమ్మకాలు 24,004 నుంచి 12,682 యూనిట్లకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే దేశంలోని 9 మహా నగరాల్లో అమ్మకాలు 21% తగ్గొచ్చని సంస్థ వెల్లడించింది. బెంగళూరులో, చెన్నైలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. High Base Effect ఇళ్ల అమ్మకాల్లో క్షీణతకు కారణంగా తెలుస్తోంది.
News December 22, 2024
టెన్త్ విద్యార్థులకు ALERT.. మోడల్ పేపర్లు విడుదల
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులతో ఈ పేపర్లను ప్రాక్టీస్ చేయించాలని స్కూళ్లకు సూచించింది. <
News December 22, 2024
రోహిత్‌కు గాయం!
టీమ్ ఇండియాకు నెట్ సెషన్లలో వరస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఓపెనర్ రాహుల్ చేతికి గాయం కాగా తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడ్డారు. ఎంసీజీ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది. దీంతో ఆయన నొప్పితో పక్కన కూర్చుండిపోయారు. అయితే మ్యాచ్ జరిగేందుకు ఇంకా 4 రోజులున్న నేపథ్యంలో ఆటగాళ్లు కోలుకుంటారని టీమ్ ఇండియా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.