News June 10, 2024

కర్నూలు: నీటి కుంటలో పడి బాలుడి మృతి

image

హాలహర్వి మండలం నిట్రవట్టిలో మనోజ్ కుమార్(9) అనే బాలుడు ఆదివారం నీటి కుంటలో పడి మృతిచెందాడు. గ్రామంలోని వడ్డే మల్లికార్జున, మీనాక్షి దంపతులకు ముగ్గురు సంతానం. మూడో సంతానం మనోజ్ కుమార్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి పక్కనే ఉన్న నీటి కుంటలో పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News October 3, 2025

దేవరగట్టులో మూడుకు చేరిన మృతుల సంఖ్య!

image

దేవరగట్టు కర్రల సమరంలో జరిగిన హింసలో మరొకరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఆలూరు మండలం అరికెరకు చెందిన తిమ్మప్ప, ఆలూరుకు చెందిన నాగరాజుగా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. 2 లక్షలకు పైగా భక్తలు పాల్గొన్న ఈ ఉత్సవంలో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు సందర్భంగా ఉత్సవమూర్తుల కోసం కర్రలతో 3 గ్రామాల ప్రజలు ఒకవైపు, 11 గ్రామాల ప్రజలు మరోవైపు ఉండి కొట్టుకుంటారు.

News October 2, 2025

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి: కలెక్టర్

image

జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన అహింస, శాంతి మార్గాలను ఎంచుకొని ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. గురువారం పంచలింగాలలోని జిల్లా జైలులో ఖైదీల దినోత్సవం నిర్వహించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని జైలు ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పాల్గొన్నారు.

News October 2, 2025

మహాత్మా గాంధీ స్ఫూర్తితో యువతరం రాణించాలి: కలెక్టర్

image

మహాత్మా గాంధీ స్ఫూర్తితో నేటి యువతరం అన్ని రంగాల్లో రాణించి దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి కేఎంసీ కమిషనర్ విశ్వనాథ్‌తో
కలిసి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన కృషి వెలకట్టలేనిది కొనియాడారు.