News June 10, 2024

Modi 3.0: కేరళ నుంచి ఇద్దరికి చోటు

image

కేరళలో బీజేపీకి తొలి విజయాన్ని అందించి రికార్డు సృష్టించిన సురేశ్ గోపికి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కింది. త్రిశ్శూర్ నుంచి MPగా పోటీ చేసిన ఈ నటుడు.. CPI నేత సునీల్ కుమార్‌పై 74వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక కేరళ నుంచి మరో BJP నేత అయిన జార్జ్ కురియన్‌కు సైతం మంత్రివర్గంలో అవకాశం దక్కింది. ఈయన ప్రస్తుతం కేరళ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.

Similar News

News December 22, 2024

గాయపడిన వారిలో ఏడుగురు భారతీయులు

image

జ‌ర్మ‌నీలో క్రిస్మ‌స్ మార్కెట్‌‌లో జనాలపైకి కారు దూసుకొచ్చిన‌ ఘ‌ట‌న‌లో ఏడుగురు భార‌తీయులు కూడా గాయపడ్డారు. మాగ్డెబ‌ర్గ్ న‌గ‌రంలోని ర‌ద్దీ ప్రాంతంలో 50 ఏళ్ల తాలెబ్ కారులో వేగంగా వ‌చ్చి ప్ర‌జ‌ల్ని ఢీకొంటూ వెళ్లాడు. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, మ‌రో 200 మంది గాయప‌డ్డారు. వీరిలో 41 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

News December 22, 2024

HYDలో భారీగా త‌గ్గ‌నున్న ఇళ్ల అమ్మ‌కాలు

image

HYDలో Oct-Dec క్వార్ట‌ర్‌లో ఇళ్ల అమ్మ‌కాలు 47% త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని PropEquity అంచ‌నా వేసింది. గ‌త ఏడాది Q3తో పోలిస్తే అమ్మ‌కాలు 24,004 నుంచి 12,682 యూనిట్ల‌కు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. అలాగే దేశంలోని 9 మ‌హా న‌గ‌రాల్లో అమ్మ‌కాలు 21% త‌గ్గొచ్చని సంస్థ వెల్ల‌డించింది. బెంగ‌ళూరులో, చెన్నైలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. High Base Effect ఇళ్ల అమ్మ‌కాల్లో క్షీణ‌తకు కారణంగా తెలుస్తోంది.

News December 22, 2024

టెన్త్ విద్యార్థులకు ALERT.. మోడల్ పేపర్లు విడుదల

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులతో ఈ పేపర్లను ప్రాక్టీస్ చేయించాలని స్కూళ్లకు సూచించింది. <>ఆన్‌లైన్‌లో<<>> ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈసారి క్వశ్చన్ బ్యాంక్ కొత్త వెర్షన్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.