News June 10, 2024

అదనపుకట్నం కోసం వేధింపులు.. భార్య ఫిర్యాదు

image

బాపట్లలో అదనపు కట్నం కోసం భర్త, అత్త మామలు వేధిస్తున్నారని వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై బాపట్ల గ్రామీణ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అవినాష్ రతన్‌తో వాసంతికి 2022లో వివాహమైంది. వివాహ సమయంలో రూ. 22 లక్షల నగదు, బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. కొంత కాలానికి అదనంగా కట్నం తీసుకురావాలని తనను భర్త అవినాష్ రతన్, అత్త, మామ వేధిస్తున్నారని వివాహిత ఫిర్యాదు చేసింది.

Similar News

News September 14, 2025

గుంటూరు: నష్టపరిహారంగా రూ.1.11 కోట్లు

image

గుంటూరు జిల్లాలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 11,388 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 908, క్రిమినల్ కేసులు 10,480 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీనివాసుల కుటుంబానికి రూ.1.11 కోట్లు పరిహారం అందజేయడం ప్రధానంగా నిలిచింది. ప్రజలు సమయం, డబ్బు ఆదా చేసుకునేలా ఈ వేదికను మరింతగా వినియోగించుకోవాలని జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు.

News September 13, 2025

గుంటూరు: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్

image

గుంటూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. సహాయం కోసం 0863-2234014 నంబరులో సంప్రదించాలన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని విధులు నిర్వహించేలా నియమించామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు తెలియజేస్తే అధికారులు వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

News September 13, 2025

గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న సతీష్ కుమార్‌ను సత్యసాయి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో బాపట్ల ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజయనగరం జిల్లా నుంచి బదిలీపై గుంటూరుకు వస్తున్నారు. అక్కడ మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థులు, మహిళలకు రక్షణ వంటి చర్యలు విస్తృతంగా చేపట్టారు.