News June 10, 2024
అమరావతిలో చకచకా పనులు
APలో కూటమి గెలుపుతో రాజధాని అమరావతిలో పనులు జోరందుకున్నాయి. చంద్రబాబు ప్రమాణస్వీకారంలోపు జంగిల్ క్లియరెన్స్ (ముళ్ల కంపల తొలగింపు) పూర్తి కానుంది. 109 KM నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో 94 పొక్లయిన్లతో పనులు జరుగుతున్నాయి. కరకట్ట, సీడ్ యాక్సెస్ రోడ్లపై సెంట్రల్ లైటింగ్ పున:ప్రారంభించారు. TDP హయాంలో చేపట్టిన నిర్మాణాలు ఐదేళ్లుగా నిలిచిపోవడంతో వాటి పటిష్ఠతపై నిపుణులు పరిశీలన చేయనున్నారు.
Similar News
News December 22, 2024
తెలుగు రాష్ట్రాల్లో తరుగుతున్న అటవీ సంపద!
దేశవ్యాప్తంగా అటవీ సంపద గణనీయంగా తగ్గిందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2021తో పోలిస్తే గత ఏడాది 138.66 చదరపు కిలోమీటర్లు, తెలంగాణలో 100.42 చ.కి అటవీ భూమి తగ్గిపోయిందని పేర్కొన్నారు. తొలి స్థానంలో మధ్యప్రదేశ్(371.54 చ.కి) ఉండగా రెండో స్థానంలో ఏపీ, మూడో స్థానంలో తెలంగాణ ఉండటం గమనార్హం.
News December 22, 2024
సీఎం నిర్ణయం.. ఆ సినిమాలపై ఎఫెక్ట్
ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చేది లేదని తెలంగాణ CM రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం ప్రభావం వచ్చే నెలలో విడుదల కానున్న పెద్ద సినిమాలపై పడనుంది. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీలు రానున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు ఎక్కువ రోజులు ఆడని నేపథ్యంలో బెనిఫిట్ షోల రద్దు నిర్ణయంతో పెద్ద బడ్జెట్ సినిమాలకు షాక్ తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
News December 22, 2024
గాయపడిన వారిలో ఏడుగురు భారతీయులు
జర్మనీలో క్రిస్మస్ మార్కెట్‌లో జనాలపైకి కారు దూసుకొచ్చిన ఘటనలో ఏడుగురు భారతీయులు కూడా గాయపడ్డారు. మాగ్డెబర్గ్ నగరంలోని రద్దీ ప్రాంతంలో 50 ఏళ్ల తాలెబ్ కారులో వేగంగా వచ్చి ప్రజల్ని ఢీకొంటూ వెళ్లాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 200 మంది గాయపడ్డారు. వీరిలో 41 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.