News June 10, 2024

ప.గో: డేంజర్ హైవే.. 17 నెలల్లో 104 మంది మృతి

image

ఉమ్మడి ప.గో-తూ.గో జిల్లాను కలుపుతూ గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు దాదాపు 70KM పొడవున రూ.1800 కోట్ల వ్యయంతో నిర్మించిన హైవే ప్రమాదాలకు అడ్డాగా మారింది. హైవే ఎక్కాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ఈ రూట్‌లో దేవరపల్లి మండలం డేంజర్ స్పాట్. ఈ మార్గంలో 2023 JAN నుంచి 2024 మే వరకు (17 నెలలు) దాదాపు 156 ప్రమాదాలు జరగ్గా.. 104 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయాలపాయ్యారు.

Similar News

News November 6, 2025

జాతీయ అండర్-19 జట్టుకు ఎంపికైన పాలకొల్లు సమీరుద్దీన్

image

పాలకొల్లు బ్రాడీపేటకు చెందిన షేక్ సమీరుద్దీన్ అండర్-19 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ డిసెంబర్ 5వ తేదీ నుంచి హర్యానాలో జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 69వ జాతీయ క్రికెట్ పోటిల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున అతను ప్రాతినిధ్యం వహించనున్నాడు. సమీరుద్దీన్ గతంలో ప. గో జిల్లా అండర్-17, ప్రస్తుతం అండర్-19 జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్లు కోచ్‌లు రామకృష్ణ, జయరాజు, రఫీలు తెలిపారు.

News November 6, 2025

మాక్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం చేపట్టిన “కౌశలం” సర్వేలో భాగంగా ఈనెల 6న నిర్వహించే మాక్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని సచివాలయాల్లో వెబ్ క్యామ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వే ద్వారా 1,09,347 మందిని గుర్తించి, 535 సెంటర్లలో ఈ మాక్ టెస్ట్‌ను నిర్వహిస్తామని బుధవారం ఆమె మీడియాకు వెల్లడించారు.

News November 5, 2025