News June 10, 2024
మోదీ కేబినెట్‌లోకి నడ్డా.. బీజేపీకి త్వరలో కొత్త చీఫ్?

BJP చీఫ్ జేపీ నడ్డాకి మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నట్లు తెలుస్తోంది. ‘వన్ పర్సన్, వన్ పోస్ట్’ అనే పాలసీని ఆ పార్టీ అనుసరిస్తున్నందున కొత్త చీఫ్‌ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లో అమిత్ షా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో నడ్డా పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నేతృత్వంలోనే 2024 ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసి మరోసారి అధికారం సొంతం చేసుకుంది.
Similar News
News September 13, 2025
సంగారెడ్డి: జిల్లాకు ఆరెంజ్ అలర్ట్: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య శనివారం తెలిపారు. జిల్లాకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని చెప్పారు.
News September 13, 2025
ఘర్షణల తర్వాత తొలిసారి మణిపుర్‌లో అడుగుపెట్టిన మోదీ

ప్రధాని మోదీ మణిపుర్ చేరుకున్నారు. ఇంఫాల్ ఎయిర్‌పోర్టులో ఆయనకు గవర్నర్ అజయ్ భల్లా, సీఎస్ పునీత్ గోయల్ స్వాగతం పలికారు. రెండేళ్ల నుంచి మణిపుర్‌లో తీవ్ర అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రాన్ని, ప్రధానిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శలు కూడా చేసింది. ఈక్రమంలో ఘర్షణల తర్వాత మోదీ తొలిసారి మణిపుర్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
News September 13, 2025
‘మిరాయ్’కి తొలి రోజు భారీ కలెక్షన్స్

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ మూవీ ‘మిరాయ్’ నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్‌గా ₹27.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ తెలిపింది. దీంతో ‘హనుమాన్’ తొలిరోజు(₹8 కోట్లు) కలెక్షన్స్‌ను దాటేసింది. తేజ కెరీర్లో ఇవే హయ్యెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్స్. పాజిటివ్ టాక్ నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.