News June 10, 2024
JEE అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో కర్నూలు విద్యార్థుల ప్రతిభ

JEE అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. టాప్-10లో 2 ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఆదోనికి చెందిన బీ.సందేశ్ 360 మార్కులకు 338 సాధించి మూడో ర్యాంకు, కర్నూలు గణేశ్‌నగర్‌కు చెందిన కే.తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు సాధించారు. ఆళ్లగడ్డ మండలం పాతకందుకూరుకు చెందిన పీ.రాజేశ్ కుమార్ 36వ, కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన ఎం.యశ్వంత్ రెడ్డి 50వ ర్యాంకులు పొందారు.
Similar News
News October 3, 2025
దేవరగట్టులో మూడుకు చేరిన మృతుల సంఖ్య!

దేవరగట్టు కర్రల సమరంలో జరిగిన హింసలో మరొకరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఆలూరు మండలం అరికెరకు చెందిన తిమ్మప్ప, ఆలూరుకు చెందిన నాగరాజుగా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. 2 లక్షలకు పైగా భక్తలు పాల్గొన్న ఈ ఉత్సవంలో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు సందర్భంగా ఉత్సవమూర్తుల కోసం కర్రలతో 3 గ్రామాల ప్రజలు ఒకవైపు, 11 గ్రామాల ప్రజలు మరోవైపు ఉండి కొట్టుకుంటారు.
News October 2, 2025
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి: కలెక్టర్

జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన అహింస, శాంతి మార్గాలను ఎంచుకొని ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. గురువారం పంచలింగాలలోని జిల్లా జైలులో ఖైదీల దినోత్సవం నిర్వహించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని జైలు ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పాల్గొన్నారు.
News October 2, 2025
మహాత్మా గాంధీ స్ఫూర్తితో యువతరం రాణించాలి: కలెక్టర్

మహాత్మా గాంధీ స్ఫూర్తితో నేటి యువతరం అన్ని రంగాల్లో రాణించి దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి కేఎంసీ కమిషనర్ విశ్వనాథ్‌తో
కలిసి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన కృషి వెలకట్టలేనిది కొనియాడారు.