News June 10, 2024

గుంటూరు: చంద్రబాబు ప్రమాణస్వీకారం..14 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు

image

ఈనెల 12న ఉదయం 11.27గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రుతుపవనాలు ప్రవేశించిన సమయం కావడంతో భారీ వర్షాలు పడినా ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం అల్యూమినియంతో కూడిన పటిష్ఠమైన షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5ఎకరాల్లో ప్రధాన వేదిక, VIP గ్యాలరీ, మిగిలిన 11.5ఎకరాల్లో నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.

Similar News

News September 29, 2024

రౌడీ షీటర్లు మంచి మార్గంలో జీవించండి: ఎస్పీ సతీశ్

image

గుంటూరు నగరంలోని రౌడీషీటర్లకు ఆదివారం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రౌడీషీటర్లు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి పద్ధతి మార్చుకొని మంచి మార్గంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించాలని సూచించారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతుందని చెప్పారు.

News September 29, 2024

అమరావతి: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.లక్ష విరాళం

image

క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆదివారం రూ.లక్ష చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తూ ఎంతగానో బాధితులను ఆదుకున్నారని క్రైస్తవ మిషనరీ సంఘం వారు ఆన్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సహాయం అందించడం జరిగిందని మిషనరీ బిషప్ అన్నారు.

News September 29, 2024

పల్నాడు: రైలులో భారీ చోరీ

image

హుబ్లీ నుంచి విజయవాడ వస్తున్న రైలులో శనివారం ఉదయం చోరీ జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన జ్యువెలర్స్ షాపు నిర్వాహకులు రంగారావు, సతీశ్‌లకు చెందిన రూ.2.5 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. రైలు నంద్యాల చేరుకున్న అనంతరం తాము నిద్రపోగా చోరీ జరిగిందని, నంద్యాల రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చామని రంగారావు, సతీశ్ తెలిపారు.