News June 10, 2024

సిక్కోలుకు 4వసారి కేంద్ర మంత్రి పదవి

image

సిక్కోలు జిల్లా నేతలకు నాల్గవసారి కేంద్ర మంత్రి పదవి లభించింది. 1952లో పాతపట్నం పార్లమెంట్ స్థానం నుంచి వరహగిరి వెంకటగిరి గెలిచి జవహర్‌లాల్ నెహ్రూ కేబినెట్‌లో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా చేశారు. 1996లో కింజరాపు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పని చేశారు. 2012లో కిల్లి కృపారాణి కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా రామ్మోహన్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.

Similar News

News May 7, 2025

SKLM: జాతీయ లోక్ అదాలత్ జూలై 5కి వాయిదా

image

రానున్న నెల మే 10న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్‌ను జూలై 5వ తేదీకి వాయిదా పడింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా శుక్రవారం తెలిపారు. కక్షిదారులు, న్యాయవాదులు, ప్రభుత్వ, బ్యాంకు, బీమా, పోలీసు శాఖల అధికారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News May 7, 2025

ఎచ్చెర్ల: సీఎం పర్యటనకు.. గట్టి పోలీసు బందోబస్తు  

image

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శనివారం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలోని పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి నేతృత్వంలో పోలీసు బందోబస్తు విధి నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నలుగురు ఏఎస్పీలు, ఎనిమిది మంది డిఎస్పీలతో సహా ఇతర పోలీసు అధికారులతో మొత్తానికి 1500 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు.

News April 25, 2025

శ్రీకాకుళం: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు పథక సమన్వయకర్త శశిభూషణ్ గురువారం తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల విద్యార్థుల సమీప స్కూళ్లలో 25 శాతం సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 9703585990 నంబరుని సంప్రదించాలని పేర్కొన్నారు.

error: Content is protected !!