News June 10, 2024
GET READY: సా.6 గంటలకు ‘కల్కి’ ట్రైలర్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898AD’ మూవీ ట్రైలర్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6 గంటలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు థియేటర్లలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటించారు.
Similar News
News December 23, 2024
నేనింకా బతికే ఉన్నా: కింగ్ చార్లెస్-3
క్యాన్సర్ నుంచి కోలుకున్న బ్రిటన్ రాజు చార్లెస్-3 తాజాగా పలువురు సాధారణ పౌరులతో సమావేశమయ్యారు. అత్యవసర సేవల సిబ్బంది, వాలంటీర్లు, వివిధ వర్గాల ప్రముఖులతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘రాజు గారు మీరు ఎలా ఉన్నారు?’ అని భారత సంతతికి చెందిన సిక్కు ప్రతినిధి హర్విందర్ అడిగారు. దీనికి చార్లెస్ స్పందిస్తూ తానింకా బతికే ఉన్నానని సరదాగా చెప్పడంతో అందరూ చిరునవ్వు చిందించారు.
News December 23, 2024
డిసెంబర్ 23: చరిత్రలో ఈ రోజు
✒ 1902: భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ జననం
✒ 1940: ప్రముఖ నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్ జననం
✒ 1997: పండితుడు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి మరణం
✒ 2004: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణం(ఫొటోలో)
✒ 2014: ప్రముఖ దర్శకుడు బాలచందర్ మరణం
✒ 2022: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మరణం
✒ జాతీయ రైతు దినోత్సవం
News December 23, 2024
పార్లమెంట్ సమావేశాల్లో ప్రొడక్టివిటీ లేదు: ఎంపీ భరత్
AP: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చూసిన తర్వాత తనకు బాధ కలిగిందని ఎంపీ శ్రీభరత్ చెప్పారు. రాజకీయ చర్చల వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సమావేశాల్లో ప్రొడక్టివిటీ లేదని అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1,650 కోట్లు కేటాయించినప్పటికీ సరిపోవట్లేదని తెలిపారు. ఉద్యోగుల జీతాలు, మూడో బ్లాస్ ఫర్నేస్‌కు పెట్టుబడులపై ఆర్థిక మంత్రి దృష్టిసారించాలని కోరారు.