News June 10, 2024

చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ సిద్ధం

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోసం కొత్త కాన్వాయ్ సిద్ధమైంది. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద 11 వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393 నంబర్ ప్లేట్లు వేశారు. అందులో 2 వాహనాలను సిగ్నల్ జామర్ కోసం కేటాయించారు.

Similar News

News December 24, 2024

టెలికం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు

image

వాయిస్ కాల్స్, SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని జియో, ఎయిర్‌టెల్, VI, BSNL సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. ప్రస్తుతం డేటా, కాల్స్, SMSలకు కలిపి ఈ సంస్థల ప్లాన్లు ఉన్నాయి. దీంతో డేటా అవసరం లేకున్నా ఫీచర్ ఫోన్లు వాడే వారు తప్పకుండా రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తోంది. 2 సిమ్‌లు వాడే వారూ ఒక నంబర్ వాడుకలో ఉండేలా రీఛార్జ్ చేసుకుంటూ నష్టపోతున్నారు. త్వరలో వీరి కష్టాలు తీరే అవకాశముంది.

News December 23, 2024

VRO వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు

image

తెలంగాణలో VRO వ్యవస్థ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించనుంది. పాత ఉద్యోగులను మళ్లీ VRO పోస్టుల్లోకి తీసుకోనుంది. ఇందుకోసం ఈ నెల 28 వరకు గడువు విధిస్తూ CCLA కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత ప్రభుత్వంలో VROలను ఇతర శాఖలకు బదలాయించగా, వారిని వెనక్కి రప్పించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.

News December 23, 2024

ఇంట‌ర్‌పోల్ కోసం భార‌త్‌పోల్‌.. సిద్ధం చేసిన CBI

image

ఇంట‌ర్‌పోల్ నుంచి అవసరమైన సమాచారాన్ని పొందేలా అన్ని రాష్ట్రాలు, దర్యాప్తు సంస్థల కోసం సరికొత్త టెక్నాలజీ వ్యవస్థ ‘భారత్‌పోల్’ను CBI సిద్ధం చేసింది. ఇప్ప‌టిదాకా ఇంట‌ర్‌పోల్ స‌మాచారం కోసం ఏజెన్సీలు అన్నీ CBIకు అభ్యర్థనలు పంపేవి. దీని వ‌ల్ల కేసుల విచార‌ణ‌కు అధిక స‌మ‌యం ప‌డుతుండ‌డంతో ఈ సమీకృత వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ట్రయల్స్ దశలో ఉన్న ఈ టెక్నాలజీని Jan 7న అమిత్ షా ప్రారంభించే అవకాశం ఉంది.