News June 10, 2024

UPI పేమెంట్స్ చేస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి!

image

* నగదు పంపేందుకు మాత్రమే QR కోడ్స్ స్కాన్ చేయాలి. రిసీవ్‌కు స్కాన్ అవసరం లేదు.
* UPI పిన్ ఎవరికీ చెప్పవద్దు. మీరు పేమెంట్ చేసేప్పుడు మాత్రమే పిన్ ఎంటర్ చేయాలి.
* కొత్త నంబర్లు, QR కోడ్‌లకు నగదు పంపే ముందు అక్కడ వచ్చిన పేరు వారిదేనా కాదా చెక్ చేయాలి.
* అపరిచితుల నుంచి ఆఫర్ల పేరిట వచ్చే లింక్స్ క్లిక్ చేయవద్దు.
* ఫోన్‌లు హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉన్నందున వాటిలో బ్యాంకింగ్ వివరాలను సేవ్ చేయొద్దు.

Similar News

News December 24, 2024

ఉ.కొరియాకు భారీ మిలటరీ లాస్: జెలెన్‌స్కీ

image

రష్యా తరఫున తమతో యుద్ధం చేస్తోన్న ఉత్తరకొరియా సైనికులు 3వేల మంది చనిపోవడం లేదా తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. కుర్స్క్ రీజియన్ నుంచి తమకు ఈ ప్రాథమిక నివేదిక అందిందన్నారు. మరిన్ని అదనపు బలగాలు, ఆయుధ సామగ్రిని నార్త్ కొరియా పంపనుందని, ఆ ముప్పును ఎదుర్కొనేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

News December 24, 2024

బన్నీ వివాదంపై ఎవరూ మాట్లాడొద్దని సీఎం ఆదేశాలు?

image

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట- అల్లు అర్జున్‌ విషయంపై INC నేతలెవరూ మాట్లాడొద్దని CM రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు TPCC చీఫ్ మహేశ్‌కుమార్‌కు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. చట్టం తనపని తాను చేస్తున్నందున ఇక ఎవరూ జోక్యం చేసుకోకుండా చూడాలని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో విపక్షాల ప్రశ్నలకు సమాధానంగా తాను బన్నీపై మాట్లాడానని CM పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

News December 24, 2024

పుష్ప-2 రికార్డులను YRF బద్దలుకొట్టాలి: అల్లు అర్జున్

image

కలెక్షన్లలో అదరగొడుతున్న పుష్ప-2 టీమ్‌కు యశ్‌ రాజ్ ఫిల్మ్స్(YRF) కంగ్రాట్స్ చెప్పింది. ‘రికార్డులున్నది బద్దలవడానికే. మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా ప్రతి ఒక్కరినీ కొత్త రికార్డులు ముందుకు నెడతాయి. చరిత్ర పుస్తకాలను తిరగరాస్తున్న పుష్ప-2 చిత్రబృందానికి శుభాకాంక్షలు. ఇది ఫైరు కాదు వైల్డ్ ఫైరు’ అని పేర్కొంది. దీంతో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ రికార్డును YRF బద్దలుకొడుతుందని ఆశిస్తున్నానన్నారు.